
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు పోతున్న బాలీవుడ్ బ్యూటీ డైసీ షా. కన్నడలో 'భద్ర' సినిమాతో హీరోయిన్ గా మారింది. తర్వాత ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన 'జై హో'లో నటించే ఛాన్స్ కొట్టేసింది. అనంతరం హేట్ స్టోరీ 3, రామ్ రతన్, రేస్ 3, మిస్టరీ ఆఫ్ ది టాటూ వంటి సినిమాలతో అలరించింది. అటు బుల్లితెరపైనా ఈ ముద్దుగుమ్మ దుమ్మురేపింది. ప్రస్తుతం పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది.
అయితే లేటెస్ట్ గా ఒక ఇంట ర్వ్యూలో పాల్గొన్న డైసీ షా తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ గురించి కూడా ఓపెన్ అయ్యింది. ఈ క్రమంలోనే దక్షిణాదిలో సినిమాల షూటింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 'ఇక్కడహీరోయిన్ల అందాలను, నడుము, బొడ్డును చూపించే పిచ్చి ఎక్కువగా ఉంది. ఓసారి నేను ఓ కన్నడ చానెల్ చూస్తుండగా.. అందులో ఓ నటుడు హీరోయిన్ నడుముపై పండ్లు, ఐస్ ముక్కలు వేసి ఆమె నడుమును సలాడ్ గా మార్చాడు. హీరోయిన్ల నడుము, నాభి ప్రాంతాల్లో క్లోజప్ షాట్స్ పెట్టడం అన్ని ఇండస్ట్రీలలో ఉన్నప్పటికీ.. దక్షిణాదిలో ఇది కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చింది.
అయితే డైసీ షా ఒక్కరే కాదు . గతంలో నటి మాలవిక మోహనన్ కూడా ఇలాంటి అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. నేను ముంబైలో పెరిగాను. కానీ, సౌత్ సినిమాల్లో నడుముపై అంత ఆసక్తి చూపడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇది చాలా కొత్తగా అనిపించింది. ఇప్పుడు హీరోయిన్ల నడుములపై సోషల్ మీడియాలో కూడా ప్రత్యేకంగా జూమ్ చేసిన ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇది ఒక నిజమైన విషయంగా మారిపోయిందిఅని మాలవిక అన్నారు.
►ALSO READ | Peddi Movie: రామ్ చరణ్ తల్లి పాత్రను నిరాకరించిన నటి.. షాకింగ్ నిజాలు చెప్పిన స్వాసిక!
హీరోయిన్ తాప్సీ పన్ను కూడా కొన్ని సంవత్సరాల క్రితం కామెంట్ చేశారు. ఆమె తన తొలి తెలుగు సినిమా 'ఝుమ్మంది నాదం' దర్శకుడు రాఘవేంద్ర రావు గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. నేను సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి పరిశోధన చేసి ఉంటే, నా బొడ్డుపై ఎక్కువ శ్రద్ధ పెట్టేదానిని. నేను మొదటి రోజు పాట చిత్రీకరణకు వెళ్ళాను. రాఘవేంద్ర రావు హీరోయిన్లను పరిచయం చేయడంలో దిట్ట. ఆయన శ్రీదేవి, జయసుధ వంటి వారిని కూడా పరిచయం చేశారు. నా వంతు వచ్చింది. శ్రీదేవి వంటి హీరోయిన్ల మీద పూలు, పండ్లు విసిరేవారు. కానీ, నా మీద ఒక కొబ్బరికాయ విసిరారు. ఒక కొబ్బరికాయ నా నడుము మీద పడితే అందులో ఏం రొమాన్స్ ఉంటుందో నాకు అర్థం కాలేదు అని తాప్సీ నవ్వేస్తూ చెప్పారు.
సాధారణంగా దక్షినాది సినిమాల్లో నటీమణులను తరచుగా ఇలాగే చూపిస్తుంటారు. ఇది సినిమాల్లోనే కాకుండా పాటల్లో కూడా కనిపిస్తుంది. నడుమును ఎక్కువగా చూపించడం, జూమ్ చేయడం అనేది ఒక ట్రెండ్‌గా మారిపోయింది. ప్రస్తుతం డైసీ షా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరినీ ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు కామెంట్స్ పెడు తున్నారు.