
నటి స్వాసిక మలయాళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. బుల్లితెరతో పాటు వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించింది. గత పదేళ్లుగా తనదైన శైలిలో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.
2021లో వచ్చిన' వాసంతి ' మూవీ ఆమె కెరీర్ ను ఒక మలుపు తిప్పింది. రహ్మాన్ బ్రదర్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో ప్రదర్శితమై విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది.
ఈ ' వాసంతి ' చిత్రంలో ఆమె నటనకు గాను ఉత్తమ క్యారెక్టర్ నటి (మహిళ) గా కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు. అయితే ఈ మలయాళి ముద్దుగుమ్మకు తన జీవితంలో ఊహించని అనుభవం ఒకటి ఇటీవల ఎదురైంది. టాలీవుడ్ లో నటించే ఆఫర్ వచ్చింది. కానీ అది కూడా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కి తల్లిగా నటించమని. ఇది విన్న స్వాసిక ఒక్కసారిగా షాక్ అయిందట.
ఈ విషయాన్ని స్వయంగా ఓ ప్రెస్ మీట్ లో ఆమె వెల్లడించింది. నా వయసు 33 ఏళ్లు. కెరీర్ పరంగా మొదట్లోనే ఉన్నా, కానీ ఇప్పటికే నాకు తల్లి పాత్రల కోసం అనేక ఆపర్లు వస్తున్నాయని తెలిపింది. అయితే వాటన్నింటిలో నన్ను బాగా ఆశ్చర్యపరిచిన ఆఫర్ మాత్రం ' పెద్ది'లో రామ్ చరణ్ తల్లి పాత్ర. దీంతో రామ్ చరణ్‌కు తల్లిగా నేను వెంటనే ఒప్పుకోలేకపోయాను. నాకు కుదరదు అని చెప్పేశాను అని స్వాసిక వివరించింది.
►ALSO READ | Jayam Ravi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జయం రవి, సింగర్ కెనీషా.. ఫోటోలు వైరల్
ఈ ఆఫర్ గురించి ఆమె తన మేనేజర్‌కు వివరించినప్పుడు స్వాసిక కూడా విస్తుపోయిందట. మీరు ఇంకా చాలా చిన్నవారు. ఇప్పుడు ఇలాంటి పాత్రలు చేయడం సరైన నిర్ణయం కాదు. భవిష్యత్తులో మంచి పాత్రలు దొరికే అవకాశాలు తగ్గిపోతాయి అని ఆమె మేనేజర్ కూడా సలహా ఇచ్చారని తెలిపింది.. ప్రస్తుతం ఆమెకు ఉన్న పేరు, ప్రఖ్యాతల కారణంగా ఆమెకు హీరోయిన్ పాత్రల కంటే తల్లి, అక్క, వదిన వంటి సహాయ పాత్రలే ఎక్కువగా వస్తున్నాయని స్వాసిక ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్వాసిక చాలా సీరియల్స్‌లో నటించినప్పటికీ, అవి కూడా తల్లి పాత్రలే కావడం గమనార్హం.
అయితే ఒక నటిగా స్వాసిక ఇలా స్పందించడంలో ఆశ్చర్యం లేదంటున్నారు సినీ వర్గాలు. ఆమె రామ్ చరణ్ కంటే ఏడేళ్లు చిన్నది. ఇలాంటి పాత్రలు ఆమెను ఒకే రకమైన పాత్రలకు పరిమితం చేస్తాయని ఆమె భయపడింది. తన కెరీర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఎన్నో రకాల పాత్రలు చేయాల్సిన వయసులో ఇలాంటి పాత్రలు రావడం ఆమె కెరీర్‌కు అడ్డంకి అని ఆమె భావించిందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.