అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం.. గెజిట్ నోటిఫికేష‌న్ జారీ

అమల్లోకి కొత్త రెవెన్యూ చట్టం..  గెజిట్ నోటిఫికేష‌న్ జారీ

తెలంగాణ రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన నూతన రెవెన్యూ బిల్లు చట్టం అమల్లోకి వచ్చింది. కీల‌క‌మైన ఈ చ‌ట్టంతో పాటు మొత్తం 12 బిల్లుల‌కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఆమోదం తెలిపిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో భూ హ‌క్కులు – పాసు పుస్త‌కాలు, వీఆర్‌వోల ర‌ద్దు, టీఎస్ బీపాస్, పుర‌పాల‌క‌, పంచాయ‌తీరాజ్‌, ప్రైవేటు వ‌ర్సిటీలు, తెలం‌గాణ విపత్తు, ప్రజా‌రోగ్య పరి‌స్థితి బిల్లు, తెలం‌గాణ ఉద్యో‌గుల పదవీ విర‌మణ వయసు క్రమ‌బ‌ద్ధీ‌క‌రణ బిల్లు, తెలం‌గాణ ఫిస్కల్‌ రెస్సా‌న్స్‌‌బి‌లిటీ అండ్‌ బడ్జెట్‌ మేనే‌జ్‌‌మెంట్‌ బిల్లు, తెలం‌గాణ న్యాయ‌స్థా‌నాల రుసుము, దావాల మదింపు సవ‌రణ బిల్లు, తెలం‌గాణ సివిల్‌ న్యాయ‌స్థా‌నాల సవ‌రణ బిల్లుతో పాటు జీఎస్టీ స‌వ‌ర‌ణ చ‌ట్టాల అమ‌లుకు ప్ర‌భుత్వం గెజిట్ నోటిఫికేష‌న్లు జారీ చేసింది. దీంతో బిల్లులు చట్ట రూపం దాల్చాయి. తాజా ఉత్వర్వులతో ఈ బిల్లుల‌న్నీ అధికారికంగా అమ‌ల్లోకి రానున్నాయి.