పార్లమెంటు ఎలక్షన్‌ ఏర్పాట్లలో..ఆఫీసర్లు బిజీ

పార్లమెంటు ఎలక్షన్‌ ఏర్పాట్లలో..ఆఫీసర్లు బిజీ
  •     కోడ్​ పరిశీలనకు 47 టీమ్​లు
  •     జిల్లాలోకి ప్రవేశించే ఆరు చోట్ల చెక్​పోస్టులు 
  •     సీఎంసీ కౌటింగ్​ సెంటర్​కు వేగంగా రిపేర్లు​ 

​నిజామాబాద్​, వెలుగు : పార్లమెంట్​ ఎన్నికల ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం  బిజీబిజీగా మారింది.  కోడ్​ పర్యవేక్షణతో పాటు పోలింగ్​ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.  ఎంపిక చేసిన ఎలక్షన్​ స్టాఫ్ 7,711 మంది ట్రైనింగ్​ కోసం మాస్టర్​ ట్రైనర్లను రెడీ చేశారు.   అసెంబ్లీ సెగ్మెంట్​ల వారీగా ఈవీఎం డిస్ట్రిబ్యూషన్​ సెంటర్లలో పనులు నడుస్తున్నాయి.  కౌంటింగ్​ కోసం సెలెక్ట్​ చేసిన డిచ్‌పల్లి సీఎంసీ మెడికల్​కాలేజీ బిల్డింగ్​ రిపేర్లు స్పీడ్​గా కొనసాగుతున్నాయి.  

నిఘాకు చెక్​పోస్టులు

ఇందూర్​కు సరిహద్దులో మహారాష్ట్ర, నిర్మల్​, ఆదిలాబాద్​, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా బార్డర్స్​ ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి నగదు, మద్యం సరఫరా  జరగకుండా పెర్కిట్​, డిచ్​పల్లి, సాలూరా, పోతంగల్​, కందకుర్తి, మాధవ్​నగర్​ బ్రిడ్జి వద్ద చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు.  మోడల్​ కోడ్​ పర్యవేక్షణనకు 17, స్టాటిస్టిక్స్​ సర్వైలెన్స్​కు 18, వీడియో సర్వైలెన్స్​ 12 కలిపి మొత్తం 47 టీంలు పనిచేస్తున్నాయి.  

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్స్‌ లో సీసీలు 

జిల్లాలోని  ఐదు అసెంబ్లీ సెగ్మెంట్​లతో పాటు బాన్సువాడ నియోజకవర్గ ఎన్నికల బాధ్యత జిల్లా కలెక్టర్​ రాజీవ్​గాంధీకే కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అప్పగించింది.  మొత్తం 14,06,785 ఓటర్ల కోసం 1,549 పోలింగ్​ కేంద్రాలను ఇప్పటికే నిర్ణయించారు.  డిస్ట్రిబ్యుషన్​ సెంటర్ కోసం బాల్కొండలో గవర్నమెంట్​ జూనియర్​ కాలేజీ, బోధన్​, ఆర్మూర్​లో గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీ బిల్డింగ్​లు, అర్బన్​, రూరల్​ కోసం సీఎంసీ కాలేజీ, బాన్సువాడలో

శ్రీరాం నారాయణ ఖేడియా డిగ్రీ కాలేజీ భవనాన్ని ఎంపిక చేశారు.  అక్కడ క్లోజ్‌​ సర్య్కూట్‌ కెమెరాలు,  ఫైర్​ అలారం పరికరాలు బిగించే నిర్ణయం తీసుకున్నారు.డిచ్​పల్లిలోని క్రిస్టియన్​ మెడికల్​ కాలేజీ బిల్డింగ్​ను (సీఎంసీ) కౌంటింగ్​ కోసం ఎంపిక చేసినందున స్పీడ్​గా దానిని సిద్ధం చేస్తున్నారు. అర్బన్​, రూరల్​ సెగ్మెంట్​ డిస్ట్రిబ్యూషన్​ సెంటర్​గా ఈ భవనాన్నే వాడాలని డిసైడ్​ అయ్యారు.

7,711 మంది స్టాఫ్​

జిల్లాలోని పార్లమెంట్​ స్థానం ఎన్నికకు మొత్తం 7,711 మంది సిబ్బందిని ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన ర్యాండమైజేషన్​ పూర్తయింది. 2,008 పోలింగ్​ ఆఫీసర్లు, 2,056 ఏపీవోలు, 3,647 ఓపీవోలు,342 మైక్రో అబ్జర్వర్లను ఎంపిక చేశారు.  జిల్లాలో 326 మంది రౌడీ షీటర్లు ఉండగా వారిపై సీపీ కల్మేశ్వర్ అధ్వర్యంలో నిరంతర పోలీసు నిఘా కొనసాగుతోంది.