పొత్తుపై 24 గంటల్లో తేల్చండి : కాంగ్రెస్ నేతలతో కోదండరాం

పొత్తుపై 24 గంటల్లో తేల్చండి : కాంగ్రెస్ నేతలతో కోదండరాం
  • పొత్తుపై 24 గంటల్లో తేల్చండి
  • కాంగ్రెస్ నేతలతో కోదండరాం

హైదరాబాద్, వెలుగు : టీజేఎస్ తో పొత్తుపై 24 గంటల్లో తేల్చాలని ఆ పార్టీ చీఫ్ కోదండరాం కాంగ్రెస్ నేతలకు సూచించారు. సోమవారం టీజేఎస్ ఆఫీస్​లో కోదండరాం, పీఎల్ విశ్వేశ్వరరావుతో మల్లు రవి భేటీ అయి చర్చించారు. రాత్రి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఠాక్రేతో కోదండరాం భేటీ అయ్యారు.

ఇప్పటికే తాము అడుగుతున్న సీట్ల వివరాలను ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అందజేశారు. కాగా, మొత్తం 12 సీట్ల లిస్ట్ అందజేయగా, అందులో 6 సీట్లు అయినా ఇవ్వాలని టీజే ఎస్ కోరుతోంది. ఇందులో సూర్యాపేట, ముథోల్, ఎల్లారెడ్డి, గద్వాల, వర్ధన్నపేట, కోరుట్ల సీట్లు ఉన్నాయి.