
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకోడానికి ఓ వ్యక్తి నిరాకరించడంతో ఎంపీడీవో నిరసనకు దిగాడు. వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే పాలకవీడు గ్రామానికి చెందిన చిన్న అచ్చయ్య తనకు వ్యాక్సిన్ వద్దంటూ మొండిగా వ్యవహరించాడు. వైద్య సిబ్బంది ఇంట్లోకి రాకుండా తలుపులు వేసుకున్నాడు. దీంతో వ్యాక్సిన వేపించుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ ఎంపీడీవో సిబ్బందితో కలిసి నిరసనకు దిగారు. అచ్చయ్య ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే తరువాత వైద్య సిబ్బంది అచ్చయ్యను ఒప్పించి వ్యాక్సిన్ వేశారు.
మరిన్ని వార్తల కోసం