
హైదరాబాద్ : అబ్దుల్లాపూర్ మెట్ గండి చెరువు గ్రామ శివారులో ఉన్న ఓ గోదాంలో పోలీసులు దాడులు నిర్వహించారు. అంగన్ వాడీ బాలామృతం పిండి బస్తాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రాలకు పంపించాల్సిన బాలామృతం సరుకును గోదాంలో నిల్వ ఉంచారు. చిన్న పిల్లలకు పౌష్టికాహారంగా ఇచ్చే పిండిని పశువులకు దాణాగా విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అంగన్ వాడీ కేంద్రాలు లేదా ప్రభుత్వ నిల్వ కేంద్రాల ద్వారా పశువుల వ్యాపారికి విక్రయిస్తున్నారా..? అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. సుమారు 2 క్వింటాల 50 కిలోల బాలామృతం పిండిని స్వాధీనం చేసుకున్నారు.