చిత్రహింసలు పెట్టి  కుక్కను చంపినోళ్లు అరెస్ట్

చిత్రహింసలు పెట్టి  కుక్కను చంపినోళ్లు  అరెస్ట్

కరీంనగర్ :  కొత్తపల్లి మండల కేంద్రంలో  ఈ నెల 15న  ఓ కుక్కను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన ఘటనలో ఎండీ ఫక్రుద్దీన్, ఎండీ అమీర్, ఎండీ ముకీద్, మహ్మద్ సమీర్ అనే నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై  కేంద్ర మాజీ మంత్రి,  బీజేపీ ఎంపీ మేనకాగాంధీ స్పందించారు.  జంతు పరిరక్షణ సమితి సభ్యురాలి హోదాలో కరీంనగర్ సీపీ సత్యనారాయణకు  ఫోన్ చేసి.. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జంతు సంరక్షణ సంఘం నేతలు కూడా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

ఈనెల 15న  కొత్తపల్లి మండలంలోని సంగెం చౌరస్తాలో ముగ్గురు వ్యక్తులు కర్రలతో కుక్కను చితకబాదారు. దీంతో అది చనిపోయింది. ఆ తర్వాత కుక్క డెడ్ బాడీని తాడుతో టూవీలర్ కు కట్టి తీసుకెళ్లాడో వ్యక్తి. ఈ విషయం హైదరాబాద్ నల్లకుంటకు చెందిన జంతు సంరక్షణ సంస్థ వ్యవస్థాపకులు పృథ్వీ పన్నీరుకు తెలిసింది. వెంటనే ఆయన కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.