సముద్రంలో పోస్ట్ బాక్స్

సముద్రంలో పోస్ట్ బాక్స్

సాధారణంగా పోస్ట్ బాక్స్ ను వీధి చివర లేదా ఊరు మధ్యలో ఏర్పాటుచేస్తారు. కానీ, జపాన్ లోని వాకాయము టౌన్కు చెందిన పోస్ట్ బాక్స్ మాత్రం సముద్రపు అడుగున ఉంటుంది. ప్రపంచంలో అత్యంత లోతు ప్రదేశంలో పోస్ట్ బాక్స్ ఇదే. అయితే ఇదేమీ టూరిజం గిమ్మిక్కు కాదు. సముద్రపు అడుగున పోస్ట్ బాక్స్ పెట్టడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే.. వాకాయము ప్రాంతంలో నివసించే వాళ్లకు చేపలు పట్టడమే వృత్తి. వీళ్లంతా సముద్రంలోకి డీప్ డ్రైవింగ్ చేస్తూ రకరకాల చేపలు పడుతుంటారు. 

రోజులో ఎక్కువ సమయం సముద్రంలోనే గడుపుతారు. అందుకే వీళ్ల కోసమని ప్రభుత్వం అండర్ వాటర్ పోస్ట్ బాక్స్ ఏర్పాటు చేసింది. వాకాయము టౌన్ వాళ్లంతా డైవింగ్కు వెళ్లినప్పుడు వాళ్ల లెట్స్ను ఆ పోస్ట్ బాక్స్లో వేస్తారు. లోకల్ పోస్ట్ మాన్ కూడా రోజూ డైవింగ్ చేస్తూవెళ్లి వాటిని కలెక్ట్ చేసుకుంటాడు. ఈ బాక్స్ లో పోస్ట్ చేయడం కోసం ప్రత్యేకంగా వాటర్ రెసిస్టెంట్ పోస్ట్ కవర్లు, ఆయిల్ కలర్ పెన్నులు ఉంటాయి. ఏటా ఈ పోస్ట్ బాక్స్కు సుమారు 1500 పోస్టులు వస్తుంటాయి. ఈ పోస్ట్ బాక్సును ఆరు నెలలకోసారి మారుస్తుంటారు.