జడ్చర్ల మండలం పోలేపల్లిలో ఖాళీ బిందెలతో నిరసన

జడ్చర్ల మండలం పోలేపల్లిలో ఖాళీ బిందెలతో నిరసన

జడ్చర్ల, వెలుగు: మూడ్రోజులుగా నీళ్లు రాకపోవడంతో తిప్పలు పడుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని శుక్రవారం జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన మహిళలు గ్రామపంచాయతీ ఆఫీస్​ ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. 

వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్​చేశారు. గ్రా మంలోని బోర్​ చెడిపోయి వారం రోజులు గడిచినా రిపేర్​ చేయకపోవడమేమిటని ప్రశ్నించారు. బండమీదిపల్లి శివారులో  పైప్​లైన్​ పగిలిపోవడంతో ఈ సమస్య వచ్చిందని, సమస్య పరిష్కరిస్తామని పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనారాయణ తెలిపారు.