రాజాపూర్ హైస్కూల్ స్టూడెంట్లకు.. యూనిఫామ్స్ ఇయ్యలే!

రాజాపూర్ హైస్కూల్ స్టూడెంట్లకు.. యూనిఫామ్స్ ఇయ్యలే!

కోడేరు, వెలుగు: స్కూల్స్​ రీ ఓపెన్​ అయ్యి నెల రోజులు కావస్తున్నా మండలంలోని రాజాపూర్  హైస్కూల్  విద్యార్థులకు యూనిఫామ్స్​ అందజేయలేదు. స్కూల్​లో 127 మంది విద్యావిద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి స్కూల్​ రీ ఓపెనింగ్​ రోజే యూనిఫాం అందజేయాల్సి ఉండగా, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారి పేరెంట్స్​ వాపోతున్నారు. 

ఆర్థిక పరిస్థితి సరిగా లేని పేరెంట్స్​ తమ పిల్లలను పాత బట్టలతోనే తమ పిల్లలను బడికి పంపిస్తున్నారు. తమ పిల్లలకు వెంటనే యూనిఫాం అందజేయాలని పేరెంట్స్  కోరుతున్నారు. ఈ విషయమై ఎంఈవో భాస్కరశర్మను వివరణ కోరగా, 40 డ్రెస్సులు వచ్చాయని, మిగతావి వచ్చాక విద్యార్థులకు పంపిణీ చేస్తామని తెలిపారు.