మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు(Tiger Nageshwara Rao). భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు వంశీ(Vamshee) తెరకెక్కిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ రిలీజ్ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో మాస్ రాజా..దసరా కి మూవీ రాబోతుందంటూ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి షూటింగ్ లొకేషన్ ఫొటోస్ తో అలనాటి స్టువర్ట్ పురం(Stuvartpuram) ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించారు మేకర్స్.
లేటెస్ట్గా టైగర్ నాగేశ్వరరావు జీవితంలో డెంజరస్ లేడీ గా పిలువబడే క్యారెక్టర్ ఫోటోను షేర్ చేసింది చిత్ర బృందం. డెంజరస్ లేడీ అలియాస్ జయవాణి అనే పాత్రకు సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేసి..మాస్ రవితేజ ఫ్యాన్స్లో ఉడుకు పుట్టించేశారు. తన ఊరమాస్ వయ్యారపు లుక్స్తో జయవాణి పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ జయవాణి అనే పాత్రలో తమిళ నటి అనుకృతి వాస్(Anukreethy Vas) నటిస్తోంది.
ALSO READ: భీకరమైన వరదల నేపథ్యంలో.. ముంబై డైరీస్ సీజన్ 2 ట్రైలర్
అనుకృతి వాస్ ఎవరనేది.. సినిమాల్లో పెద్దగా పరిచయం లేకున్న.. గ్లామర్ ప్రపంచానికి తను ఎవరో తెలుసు.25 ఏళ్ల వయస్సులోనే 2018 మిస్ ఇండియాగా కిరీటాన్ని సొంతం చేసుకుంది. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన డిఎస్పి(DSP) మూవీలో నటించింది. ఇక తెలుగు ఇండస్ట్రీలో తన టాలెంట్ను చూపించడానికి సిద్ధపడ్డ అనుకృతికి..ఈ డెంజరస్ జయవాణి క్యారెక్టర్ ఎలా మలుపును ఇస్తుందో చూడాలి.
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైనా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి. రవితేజ మాస్ లుక్స్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా కనిపిస్తుండటంతో టైగర్ నాగేశ్వర రావుపై అంచానాలు పెరిగిపోయాయి. ఇక 1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్(Nupur saono) హీరోయిన్గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) నిర్మిస్తున్న ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మురళి శర్మ, రేణు దేశాయ్, గాయత్రీ భార్గవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Meet #Jayavani - ??? ??????? ???? ?? ???? ❤️@anukreethy_vas is a stunner of a performer who brings the game to the stage and leave you all spellbound ?#TigerNageswaraRao Trailer On October 3rd ?
— Abhishek Agarwal ?? (@AbhishekOfficl) September 29, 2023
Grand release worldwide on October 20th ? pic.twitter.com/prfmdm9nE8