పసుపు సాగు తగ్గడంతోనే ధర పెరిగింది : భూపతిరెడ్డి

పసుపు సాగు తగ్గడంతోనే ధర పెరిగింది : భూపతిరెడ్డి
  •     ఇందులో ఎంపీ అర్వింద్ గొప్ప ఏమిటి?
  •     బోర్డు ఏర్పాటు ప్రకటనకే పరిమితం
  •     రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి

నిజామాబాద్, వెలుగు : పసుపు పంట సాగు విస్తీర్ణం తగ్గడంతోనే డిమాండ్ ​ఏర్పడి ధర పెరిగిందని రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్ ​భూపతిరెడ్డి అభిప్రాయపడ్డారు. ధర పెరుగుదలకు తానేదో చేసినట్లు ఎంపీ అర్వింద్​ బిల్డప్ ​ఇవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. డీసీసీ ఆఫీస్​లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పసుపు బోర్డు ఏర్పాటు ఆరు నెలల నుంచి పేపర్​పైనే ఉందని ఆఫీస్​ ఎక్కడ నిర్మించాలనే విషయం డిసైడ్ ​కాలేదన్నారు.

పార్లమెంట్​ఎలక్షన్​లో లబ్ధి పొందడానికే అర్వింద్​ బోగస్​మాటలతో మోసం చేస్తున్నారని,ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు. జిల్లాలో ఏటా 85 వేల ఎకరాల పసుపు సాగు కాగా ఈ ఏడు 35 వేలకు పడిపోయిందన్నారు. గడిచిన ఐదేండ్లలో ఆయన చేసిన డెవలప్​మెంట్ ఏదీలేదన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ ​తాహెర్, కిసాన్ ​కేత్ ​జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి పాల్గొన్నారు.