అగ్నిప‌థ్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేప‌ట్టనున్న పంజాబ్ స‌ర్కార్‌

అగ్నిప‌థ్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేప‌ట్టనున్న పంజాబ్ స‌ర్కార్‌

చండీఘ‌ఢ్ : కేంద్రం ఇటీవ‌ల ప్రక‌టించిన అగ్నిప‌థ్ స్కీంపై నిర‌స‌న‌లు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో అగ్నిప‌థ్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని తీసుకువస్తామని పంజాబ్ సర్కార్ (ఆప్ ప్రభుత్వం) ప్రక‌టించింది. అగ్నిప‌థ్ స్కీంకు వ్యతిరేకంగా ప్రస్తుత అసెంబ్లీ స‌మావేశాల్లో సంయుక్త తీర్మానాన్ని తీసుకురావాల‌ని ముఖ్యమంత్రి భ‌గ‌వంత్ మాన్‌కు విప‌క్ష నేత ప్రతాప్ సింగ్ బ‌జ్వా సూచించారు. బ‌జ్వా ప్రతిపాద‌న‌ను సీఎం భ‌గ‌వ‌త్ మాన్ స‌మ‌ర్ధిస్తూ ఈ వాద‌న‌తో తాము ఏకీభ‌విస్తాన‌ని చెప్పారు. 17 ఏండ్ల యువ‌త సాయుధ బ‌ల‌గాల్లో చేరి నాలుగేళ్లకే మాజీ సైనికోద్యోగుల‌కు ల‌భించే ఎలాంటి ప్రయోజ‌నాలు లేకుండా బ‌య‌ట‌కు రావ‌డం స‌రైంది కాద‌ని అన్నారు. గ‌తంలో సాగు చ‌ట్టాలు, సీఏఏ, ఆ తర్వాత అగ్నిప‌థ్ వంటి చ‌ట్టాలు తీసుకువ‌చ్చి ప్రజ‌ల‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని అన్నారు.

ప్రజ‌లను గంద‌ర‌గోళంలోకి నెట్టే చ‌ట్టాల‌ను తీసుకురావ‌ద్దని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. అగ్నిప‌థ్ ప‌థకాన్ని కాంగ్రెస్ స‌హా ప‌లు విప‌క్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయినా.. కేంద్రం నోటిఫికేష‌న్లు జారీ చేసింది.