TheRajaSaab: గ్లామర్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకునే అందాల నిధి.. ‘రాజా సాబ్’ స్పెషల్ అప్డేట్తో ఇంప్రెస్..

TheRajaSaab: గ్లామర్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకునే అందాల నిధి.. ‘రాజా సాబ్’ స్పెషల్ అప్డేట్తో ఇంప్రెస్..

కెరీర్‌‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన గ్లామర్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకుని స్టార్ హీరోలకు జోడీగా వరుస సినిమాల్లో నటిస్తోంది నిధి అగర్వాల్. ఆదివారం (AUG17) ఆమె పుట్టినరోజు.

ఈ సందర్భంగా నిధి నటిస్తున్న ‘రాజా సాబ్’చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌తో తనకు బర్త్‌‌‌‌డే విషెస్ తెలియజేశారు మేకర్స్. దేవుడిని ప్రార్థిస్తున్నట్టు ఉన్న ఈ స్టిల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇటీవల రిలీజ్ చేసిన ‘రాజా సాబ్’టీజర్‌‌‌‌‌‌‌‌లో కూడా నిధి అగర్వాల్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసింది. ఇందులో ఆమె నటనకు అవకాశమున్న ఇంపార్టెంట్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కనిపించనుందని తెలుస్తోంది. ఈ చిత్రం తన కెరీర్‌‌‌‌‌‌‌‌కు ఎంతో ప్రత్యేకంగా ఉండనుందని నిధి భావిస్తోంది.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, రిద్ది కుమార్  కూడా  హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో సినిమా రిలీజ్ అని ప్రకటించినప్పటికీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.