
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. నామినేషన్ల స్ర్కూటిని తరువాత రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నట్లు సీఈఓ కార్యాలయం బుధవారం ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర్ రావు, పార్థసారధి రెడ్డి నామినేషన్లు ధ్రువీకరించిన అధికారులు.. వారిద్దరు చెరో స్థానానికి బరిలో ఉన్నట్లు ప్రకటించారు. దీంతో రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల విత్ డ్రాకు మూడో తేదీ వరకు గడువు ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. విత్ డ్రా గడువు ముగిసిన తరువాత ఇద్దరు సభ్యులు రాజ్యసభకు ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.