
ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిపై రోజుకో వార్త వైరల్ అవుతోంది. తొలి సినిమా మినహా ఇప్పటివరకూ ఒక్క హిట్ లేకున్నా యూత్‌లో ఈ బ్యూటీకి క్రేజ్ తగ్గలేదు. వేగంగా సినిమాలు చేయడంలో మాత్రం ఈ బ్యూటీ వెనకబడుతోంది. కథల ఎంపికలో కృతి చేసిన మిస్టేక్స్ వల్లే సినిమాలు బోల్తా కొడుతున్నాయనే టాక్ నడుస్తోంది. కానీ, అసలు విషయం అది కాదట. గ్లామర్ ఫీల్డ్‌లో ఉండి ఎక్స్పోజింగ్ విషయంలో హద్దులు పెట్టడం వల్లే చాలా అవకాశాలను కృతి వదులుకుంటోందని అంటున్నారు.
ఓ వైపు శ్రీలీల వంటి హీరోయిన్లు చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉంటున్నారు. కృతికి మాత్రం కస్టడీ తర్వాత మరో సినిమా లేదని తెలుస్తోంది. స్టార్ హీరోలకు సైతం మ్యాచయ్యే పర్సనాలిటీ, అందం ఉన్నా నెంబర్ రేసులో బేబమ్మ వెనకపడుతుండటంతో ఆమె ఫ్యాన్స్ హర్టవుతున్నారట.