
ప్రభాస్ ఫ్యాన్స్ ఇంకా కల్కి సక్సెస్ హ్యాంగోవర్ నుండి బయటకు రాకముందే వారికోసం మరో గుడ్ న్యూస్ రెడీగా ఉంది. అదేంటంటే.. సలార్ పార్ట్ 2 అప్డేట్. అవును గత సంవత్సరం విడుదలైన సాలార్ మూవీ ఎంత భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. దాదాపు రూ.700 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా చాలా రోజుల తరువాత ప్రభాస్ కి భారీ విజయాన్ని ఇచ్చింది.
ఇక అప్పటినుండి సలార్ పార్ట్ 2 కోసం ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. శౌర్యంగా పర్వం ఎప్పుడు మొదలనుందని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజాగా వారికి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అదేంటంటే.. సలార్ పార్ట్ 2 శౌర్యంగపర్వం మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుండి మొదలుకానుందట. ఆగస్టు 10 నుండి దాదాపు 15 రోజుల పాటు ఈ షూటింగ్ జరుగనుందని టాక్. ఈ షెడ్యూల్ లో ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య భారీ యాక్షన్ సీన్ ను తెరకెక్కించనున్నారట. దీంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.