ఆస్పత్రుల్లో చేరేందుకు రిపోర్టు అక్కర్లేదు

ఆస్పత్రుల్లో చేరేందుకు రిపోర్టు అక్కర్లేదు

కరోనా రోగులు ఆస్పత్రుల్లో చేరేందుకు కరోనా పాజిటివ్‌‌ రిపోర్టు తప్పనిసరి కాదని, లక్షణాలుంటే  చేర్చుకొని ట్రీట్ మెంట్ ఇవ్వాలని కేంద్రం చెప్పింది. ఏ రాష్ట్రంలోనైనా ఇతర ప్రాంతాల రోగులకూ ఆక్సిజన్‌‌, మందులివ్వాలని పేర్కొంది. కరోనా రోగులు ఆస్పత్రుల్లో చేరేందుకు పాజిటివ్‌‌‌‌ రిపోర్టు తప్పనిసరి కాదు. బాధితులను ఆస్పత్రుల్లో చేర్చుకొని ట్రీట్ మెంట్  ఇవ్వాల్సిందే. ఏ కారణంతోనూ ఏ రోగికీ ట్రీట్ మెంట్ నిరాకరించొద్దు. వేరే ప్రాంతానికి చెందిన రోగులకూ ఆక్సిజన్‌‌‌‌ లేదా అత్యవసర మందులు ఇవ్వాలి.  వేరే నగరం నుంచి వచ్చిన బాధితులు సరైన ఐడెంటిటీ కార్డు చూపించలేదని ఆస్పత్రుల్లో చేర్చుకోకుండా నిరాకరించొద్దు. గుర్తింపు కార్డు లేకున్నా వేరే ప్రాంతాల వారిని చేర్చుకోవాలి. అన్ని ఆస్పత్రులు డిశ్చార్జ్‌‌‌‌ పాలసీని పాటించాలి. రోగుల ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఆస్పత్రుల్లో చేర్చుకోవాలి. అంతగా హాస్పిటల్‌‌‌‌ అవసరం లేనివారిని డిశ్చార్జ్‌‌‌‌ చేయాలి.