విద్యుత్ ప్రగతి సదస్సుకు స్పందన కరవు

 విద్యుత్ ప్రగతి సదస్సుకు స్పందన కరవు
  •  ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 

బెల్లంపల్లి, వెలుగు: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖ మంత్రి జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీలోని ఆర్పీ గార్డెన్​ ఫంక్షన్ హాలులో సోమవారం నిర్వహించిన విద్యుత్ ప్రగతి సదస్సుకు స్పందన కరవైంది.  ఉదయం 11 గంటలకే విద్యుత్ శాఖ బెల్లంపల్లి డివిజనల్ ఇంజనీర్ బానోతు  రాజన్న, అడిషనల్ డివిజనల్ ఇంజనీర్లు కాటం శ్రీనివాస్, రాంచందర్, టౌన్ ఏఈ బొంకూరి శ్రీనివాస్ లతో పాటు డివిజన్ లోని 7 మండలాలకు చెందిన అధికారులు, దాదాపు 200 మంది సిబ్బంది, నియోజకవర్గంలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు  హాజరయ్యారు.  

Also Read : ఖాళీ ప్లాస్టిక్‌ బాటిళ్లతో బస్‌ షెల్టర్‌ నిర్మాణం

కానీ ఈ సదస్సుకు వెయ్యి మంది వరకు రైతుల హాజరు కావాల్సి ఉండగా..  నామమాత్రంగా  సదస్సు కు వచ్చారు. కొందరు ప్రజా ప్రతినిధులు ముందే రాగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాత్రం రెండు గంటలు ఆలస్యంగా హాజరయ్యారు. ఓ దిక్కు మండుటెండ ఉక్కపోతతో వచ్చిన వారు ఉక్కిరిబిక్కిరయ్యారు.