వీడిది మామూలు బ్రెయిన్ కాదు.. రెస్టారెంట్ పేరే..  గూగుల్ SEO.. 

వీడిది మామూలు బ్రెయిన్ కాదు.. రెస్టారెంట్ పేరే..  గూగుల్ SEO.. 

వ్యాపార సంస్థలకు పేర్లు పెట్టటం కామన్.. కొందరు దేవుడి పేరు.. మరికొందరు ప్రాంతాల పేర్లు.. ఇంకొందరు వారి వారి పేర్లు పెట్టుకుంటారు.. డిజిటల్ ప్రపంచానికి తగ్గట్టు.. బ్రిలియంట్ ఐడియాతో పెట్టిన ఈ పేరు ఇప్పుడు ప్రపంచం దృష్టికి ఆకర్షిస్తుంది. ఇప్పటికే ఈ రెస్టారెంట్ పేరుపై సోషల్ మీడియా ఇంట్రస్టింగ్ డిస్కషన్ నడవటం ఆసక్తి రేపుతోంది.. ఇంతకీ ఆ రెస్టారెంట్ పేరు ఏంటీ అనేగా.. అక్కడికి వస్తున్నాం..

అమెరికాలోని ఆ రెస్టారెంట్ పేరు థాయ్ ఫుడ్ నియర్ మీ.. (THAI FOOD NEAR ME).. ఇదే ఈ రెస్టారెంట్ పేరు. మనకు ఏమైనా ఫుడ్ కావాలంటే దగ్గర్లోని రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్ ను గూగుల్ సెర్చ్ చేస్తాం.. నియర్ మీ రెస్టారెంట్స్.. నియర్ మీ ఫుడ్ డెలివరీ అంటూ వెతకటం కామన్. దీన్ని ఆప్టిమైజేషన్ చేసేది SEO.. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. విషయం ఏదైనా.. ఏ మోడల్ అయినా గూగుల్ లో అప్ లోడ్ చేయగానే ఎస్ఈవో చేయటం కామన్.. జనం కూడా వారికి కావాల్సింది అలాగే వెతకటం కూడా కామన్. 

దీన్ని బాగా పట్టేసిన సదరు రెస్టారెంట్ యజమాని.. ఏకంగా థాయ్ ఫుడ్ నియర్ మీ అంటూ పేరు పెట్టేశాడు. దీనిపై ట్విట్టర్ జోరుగా చర్చ నడుస్తుంది. స్మార్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఇదే అని.. ఆ రెస్టారెంట్ ఓనర్ బ్రెయిన్ చాట్ జీపీటీని మించి పోయిందంటూ హ్యాట్సాప్ చెబుతున్నారు. ఎస్ఈవో గేమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెస్టారెంట్ పేరుతో 30 లక్షల మంది రియాక్ట్ కావటం విశేషం. ఇలాంటి ఐడియా రావటం చాలా గొప్ప అంటున్నారు. 

ఇక రాబోయే కాలంలో ఇలాంటి ట్రెండ్ మరింత ఊపందుకుంటుందని.. అందుకు తగ్గట్టు వ్యాపార సంస్థలు, రెస్టారెంట్ల పేర్లు ఇలా ఉంటాయంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. చీప్ రెస్టారెంట్ నియర్ మీ.. బెస్ట్ చైనీస్ ఫుడ్ న్యూయార్క్, బెస్ట్ రేటెడ్ ఇలాలియన్ రెస్టారెంట్ అనే కొత్త పేర్లతో రెస్టారెంట్లు రావటం ఖాయం అంటున్నారు నెటిజన్లు.

ఏదిఏమైనా రాబోయే కాలంలో గూగుల్ ఎస్ఈవో (SEO)  పేర్లతో మన గల్లీల్లోనూ రెస్టారెంట్లు, షాపులు ఓపెన్ కావటం ఖాయం.. చూస్తూ ఉండండీ.. త్వరలోనే ఇది నిజం అవుతుంది..