
-
పేపర్1లో 61% పేపర్2లో 34% క్వాలిఫై
-
టెట్ ఫలితాలను రిలీజ్ చేసిన విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా
-
గత ఎగ్జామ్‌తో పోలిస్తే స్వల్పంగా పెరిగిన పాస్ పర్సంటేజీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్–2025) ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్ 1లో 61.50%, పేపర్ 2లో 33.98% మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అయితే, గత టెట్ ఎగ్జామ్‌తో పోలిస్తే ఈసారి స్వల్పంగా పాస్ పర్సంటేజీ పెరిగింది.
మంగళవారం సెక్రటేరియెట్‌లో టీజీ టెట్ ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తో కలిసి విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా రిలీజ్ చేశారు. టీజీ టెట్ పరీక్షలు జూన్ 18 నుంచి 30 వరకు కొనసాగాయి. ఈ పరీక్షలకు 1,83,653 మంది దరఖాస్తు చేసుకోగా,1,37,429 మంది అటెండ్ అయ్యారు. వీరిలో 59,692 మంది క్వాలిఫై అయ్యారు. ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ schooledu.telangana.gov.in లో పెట్టినట్టు టీజీ టెట్ కన్వీనర్ రమేష్ తెలిపారు.
పెరిగిన పాస్ పర్సంటేజీ
గత టెట్‌తో పోలిస్తే ఈ సారి పాస్ పర్సంటేజీ పెరిగింది. పేపర్ 1కు 47,224 మంది హాజరైతే, వారిలో 29,043 (61.50%) మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 2లో 90,205 మంది పరీక్షలు రాయగా.. 30,649 (33.98%) మంది అర్హత సాధించారు. వీరిలో మ్యాథ్స్ అండ్ సైన్స్ లో 48,998 మంది పరీక్షలకు అటెండ్ కాగా.. 17,574 (35.87%) మంది, సోషల్ స్టడీస్‌లో 41,207 మంది ఎగ్జామ్స్ రాయగా 13,075 (31.73%) మంది క్వాలిఫై అయ్యారు. గత టెట్‌తో పోలిస్తే పేపర్ 1లో 2.02 శాతం, పేపర్ 2లో 2.77 శాతం మంది క్వాలిఫై అయినోళ్ల సంఖ్య పెరిగింది. కాగా, ఇన్ సర్వీస్ టీచర్లలో సగం మంది క్వాలిఫై కాలేదు. పేపర్ 1లో 718 మంది అప్లై చేసుకోగా 417 మంది ఎగ్జామ్స్ రాశారు. వీరిలో 267 (64.03%) మంది క్వాలిఫై అయ్యారు. పేపర్2లో మ్యాథ్స్ సైన్స్ లో 3,018 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,950 మంది పరీక్ష రాస్తే, వారిలో 988(50.67%) మంది అర్హత సాధించారు. సోషల్ పేపర్లో 1,072 మంది పరీక్షలు రాయగా.. 511(47.67%) మంది క్వాలిఫై అయ్యారు.
- పేపర్ 1లో బీసీలు 15,258 (61.48%), ఎస్సీలో 932 (74.29%), ఎస్టీలో 5,199 (55.28%), జనరల్ కేటగిరీలో 932 (34.52%) మంది క్వాలిఫై అయ్యారు. ఇంగ్లిష్ / తెలుగు మీడియంఅభ్యర్థులు 28,033 మంది,ఇంగ్లిష్ /ఉర్దూ మీడియంలో 855,ఇంగ్లిష్/ హిందీ 105 మంది అర్హత సాధించారు.
- పేపర్2లో మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో బీసీలు 2,980(29.80%), ఎస్సీలు 5,994 (58.65%), ఎస్టీలు 2,309 (47.33%), జనరల్ అభ్యర్థులు 482 (10.94%) మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో ఇంగ్లిష్/తెలుగు మీడియంలో 16,730 మంది అర్హత సాధించారు.
- పేపర్2 లో సోషల్ లో బీసీలు 5,861 (24.88%), ఎస్సీలు 4,747(49.72%), ఎస్టీలు 2,233 (39.51%), జనరల్ అభ్యర్థులు 234 (9.54%) క్వాలిఫై అయ్యారు. వీరిలో ఇంగ్లిష్/ తెలుగులో 12,160 మంది అర్హత సాధించారు.