
కరోనా వారియర్లను వైరస్ బారి నుంచి కాపాడేందుకు ఓ తమిళ తంబి బాగా ఆలోచించి ఈ స్మార్ట్ రోబోను తయారుచేసిండు. శాంపిల్స్ సేకరించే టైంలో కరోనా అంటుకోకుండా ఈ రోబోను ఉపయోగించుకోవచ్చు. కరోనా టెస్టు కోసం స్వాబ్ శాంపిల్ తీసుకుంటారనే విషయం తెలిసిందే. ఆ పనిని ఈ స్మార్ట్ రోబో ఎంచక్కా చేసిపెడుతుందట. ఈ రోబోను తయారు చేసినాయన పేరు కార్తీ వేలాయుధం.. ఇదెలా పనిచేస్తుందో శనివారం ట్రయల్ చేసి చూపిస్తుండగా తీసిన ఫొటో ఇది.