ఉక్రెయిన్ పై కొనసాగుతోన్న రష్యా దాడులు

ఉక్రెయిన్ పై కొనసాగుతోన్న రష్యా దాడులు

ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఉదయం ఉక్రెయిన్ దక్షిణ తీర ప్రాంతం ఒడెసా పై వైమానిక దాడులు జరిగాయి. దీంతో అక్కడి అధికారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు అధికారులు. సైనిక చర్య ద్వారా ఉక్రెయిన్ లోని మెయిన్ సిటీలను స్వాధీనం చేసుకున్నారు రష్యా బలగాలు. కాగా... ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను రష్యా బలగాల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది ఉక్రెయిన్ రక్షణ శాఖ. కీవ్ నుంచి రష్యా సైనికులు వెనుదిరిగినట్లు తెలిపింది ఉక్రెయిన్ సైన్యం.

కీవ్ ఈశాన్య ప్రాంతంలోని బుచా సిటీలో 20 మృతదేహాలు గుర్తించారు ఉక్రెయిన్ సైనికులు. డెడ్ బాడీలు వాహనాల్లో ఇరుక్కుపోయి.. శిథిలాల మధ్య నలిగిపోయి ఉన్నట్లు.. డెడ్ బాడీల దయనీయ స్థితిని తెలిపింది లోకల్ మీడియా. ఒక డెడ్ బాడీకి రెండు చేతులు వెనక్కి కట్టి ఉన్నట్లు తెలిపాయి మీడియా వర్గాలు. ఉక్రెయిన్ కు ఇప్పటికే 160 కోట్ల డాలర్లకు పైగా భద్రత సాయాన్ని అందించిన అమెరికా మరో 30 కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని ప్రకటించింది. తాజా ప్యాకేజీలో భాగంగా ఉక్రెయిన్ కు గైడెడ్ రాకెట్ వ్యవస్థలు, మానవ రహిత విమానాలు, సాయుధ ట్యాంకులు ఇతర సామగ్రిని సరఫరా చేయనుంది. ఈ సాయం ఉక్రెయిన్ సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని తెలిపింది అమెరికా రక్షణ శాఖ.

మరిన్ని వార్తల కోసం

దేశంలో కొనసాగుతున్న పెట్రోల్ బాదుడు.. ఇవాళ ఎంతంటే

రాములోరి కల్యాణానికి ముస్తాబైన భద్రాద్రి