ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిరిసిల్ల టౌన్, వెలుగు : స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి మానేరు తీరం వరకు మంగళవారం సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో నిబద్ధతతో పని చేస్తూ ప్రాణాలను కూడా లెక్కచేయని పోలీసుల కృషి అభినందనీయమన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. ర్యాలీలో సీఐలు అనిల్ కుమార్, ఉపేందర్, ఆర్.ఐ లు కుమారస్వామి, యాదగిరి, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.  

పోలీస్ ఉద్యోగాలకు సింగరేణి ఉచిత శిక్షణ

గోదావరిఖని, వెలుగు : పోలీస్‌‌‌‌ ఉద్యోగాల కోసం సింగరేణి సంస్థ ఉచిత శిక్షణను అందిస్తున్నదని ఆర్జీ 1 ఏరియా జీఎం కె.నారాయణ, ఆర్జీ 2 ఏరియా జీఎం ఎ.మనోహర్‌‌‌‌ మంగళవారం తెలిపారు. సింగరేణి ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లలు, స్థానిక భూ నిర్వాసిత, పరిసర గ్రామాల నిరుద్యోగ యువత పోలీస్‌‌‌‌ శిక్షణ పొందడానికి అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 29వ తేదీలోపు పూర్తి వివరాలు ఇవ్వాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించండి

గంగాధర, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ అన్నారు. మంగళవారం బూరుగుపల్లిలోని తన ఇంట్లో నియోజకవర్గంలోని ఆరు మండలాల ఐకేపీ ఏపీఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని, రైతులు దళారులకు అమ్ముకుని మోసపోవద్దన్నారు. గన్నీ సంచులు, లారీలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. సమావేశంలో ఏపీఎంలు పవన్​కుమార్, ప్రభాకర్, నర్మద, నర్సయ్య, దేవరాజం, చిన్నరాజయ్య తదితరులు పాల్గొన్నారు. 

సివిల్ సప్లై గోదాంలో అగ్ని ప్రమాదం

లక్షల్లో గోనె సంచులు దగ్ధం

తంగళ్లపల్లి,వెలుగు:  మండలంలోని టెక్స్ టైల్ పార్క్ సమీపంలోని సివిల్ సప్లై గోదాంలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్​సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. గోదాంలో సుమారు 13 లక్షల గోనె సంచులు ఉండడంతో వాటిని బయటకు తీయడానికి రెండువైపులా ఉన్న గోదాం గోడలను జేసీబీలతో కూల్చివేశారు. కాగా ప్రమాదంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోదాంలో విద్యుత్ సప్లై లేకపోవడంతో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం లేదని, ఎవరైనా కాల్చిన పటాకులు గోదాంలో పడ్డాయా? లేక కావాలనే నిప్పటించారా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఎమ్మార్వోలు సదానందం, విజయ్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ అధికారి ప్రభాకర్ రెడ్డి, రూరల్ సీఐ ఉపేందర్, ఎస్సై లక్ష్మారెడ్డి  ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

కోనరావుపేట, వెలుగు : కేంద్ర, రాష్త్ర ప్రభుత్వా లు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని వి ద్యాసాగర్ రావు సూచించారు. మంగళవారం కోనరావుపేట మండలం నాగారంలోని జీఎం ఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఇన్​స్టిట్యూట్ ను పరిశీలించారు. ప్రభుత్వాలు వృత్తి నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసి చదువులేని యువతకు కూడా ఉపాధి మార్గాలు చూపాలన్నారు. 

ప్రతాప రామకృష్ణకు పరామర్శ..

వేములవాడ: ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ తల్లి చనిపోవడంతో విద్యాసాగర్ రావు మంగళవారం వేములవాడలో ఆయనను పరామర్శించారు. అనంతరం పార్టీ ఆఫీస్​లో మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేతలు చెప్పిన విషయాలు ఆచరించాల్సిన అవసరం ఉందని ఆర్థిక అసమానతలతో దూరమవుతున్న సమానత్వాన్ని ఒకటి చేయాలని అన్నారు. ఆయన వెంటబీజేపీ జిల్లా కార్యదర్శి సురేందర్ రావు, లీడర్లు గొట్టే రామచంద్రం, బండ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.  

అక్రమ అక్రిడిటేషన్ల జారీపై కలెక్టర్ సీరియస్ 

ఒకరి సస్పెన్షన్​, ఏడీకి మెమో 

కరీంనగర్, వెలుగు: జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్ల విషయంలో కరీంనగర్​కలెక్టర్​కర్ణన్​అధికారులపై సీరియస్​అయ్యారు. జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో చర్చించి, కలెక్టర్ ఆమోదం పొందిన కార్డులు కాకుండా డీపీఆర్వో ఆఫీస్​సిబ్బంది ఇష్టారీతిగా కార్డులు జారీ చేశారు. ఇలా సుమారు 40కి పైగా కార్డులు జారీ అయ్యాయి. కార్డులు ప్రింట్ అయ్యాక ఈ విషయం తెలిసిన కలెక్టర్​కర్ణన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించడంతో అధికారులు అంతర్గత విచారణ చేపట్టి కమిటీ ఆమోదం లేకుండానే కార్డులు జారీ చేసినట్లు తేల్చారు. దీంతో టైపిస్టు శివానిని సస్పెండ్ చేశారు. అలాగే కార్డులు ఎక్కువ అప్రూవల్ అవుతున్నా పట్టించుకోని ఏడీ కలీంకు ఆర్జేడీ మెమో జారీ చేశారు.

చెస్​లో సెయింట్​ జార్జ్ స్టూడెంట్స్​ సత్తా

కొత్తపల్లి, వెలుగు: జీనియస్​ చెస్ అకాడమీ కరీంనగర్​లో నిర్వహించిన చెస్​ పోటీల్లో సెయింట్​జార్జ్​ స్టూడెంట్స్ సత్తాచాటినట్లు స్కూల్ చైర్మన్ డాక్టర్​ పి.ఫాతిమారెడ్డి మంగళవారం తెలిపారు. అమిత్​చంద్ర 4/5, శ్రీచరణ్​ 3/5 పాయింట్లతో గెలుపొందినట్లు పేర్కొన్నారు. సత్తాచాటిన స్టూడెంట్స్​ను చైర్మన్​ ఫాతిమారెడ్డి, ప్రిన్సిపల్​ వి.నిరంజన్, టీచర్స్​ అభినందించారు.  

గో దీక్షను విజయవంతం చేయండి

తిమ్మాపూర్, వెలుగు : మండలంలోని సుభాష్ నగర్ లో నేటి నుంచి నవంబర్ 5 వరకు నిర్వహించే గో దీక్షను విజయవంతం చేయాలని వీర బ్రహ్మేంద్ర స్వామి గోశాల నిర్వాహకులు వీరమద్వి రాజ్ మంగళవారం తెలిపారు. గో వందేమాతరం మిషన్ ఆధ్వర్యంలో పీఠాధిపతి శివలింగం స్వామిజీ, పురాణం మహేశ్వర శర్మ 11 రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. గో దీక్షకు మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ తదితరులు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో డాక్టర్ వేణు కుమార్, కనుపర్తి మురళి, శ్రీకాంత్, రవి, పరుశరాం, తదితరులు ఉన్నారు.

కరెంట్ షాక్‌‌‌‌తో కార్మికుడు  మృతి

గోదావరిఖని, వెలుగు : టీఎస్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌కో విద్యుత్‌‌‌‌ లైన్లకు అడ్డుగా ఉన్నాయని చెట్ల కొమ్మలు కొట్టేస్తుండగా కరెంట్‌‌‌‌ షాక్‌‌‌‌ తగిలి బానోతు రమేశ్‌‌(48) అనే గ్యాంగ్‌‌ ఆర్టిజన్‌‌‌‌ కార్మికుడు మృతి చెందాడు. రామగుండం ఎస్టీ కాలనీలో నివసించే రమేశ్ తరుచుగా తమ గ్యాంగ్‌‌‌‌ ఆధ్వర్యంలో ట్రాన్స్‌‌‌‌కోకు చెందిన పనులు చేస్తుంటాడు. మంగళవారం అంతర్గాం మండలంలోని బ్రాహ్మణపల్లివద్ద 132 కేవీ విద్యుత్‌‌‌‌ లైన్‌‌‌‌కు అడ్డుగా ఉన్న టేకు‌‌ చెట్లను కట్‌‌‌‌ చేస్తుండగా కొమ్మలు విద్యుత్‌‌‌‌ లైన్‌‌‌‌కు తగిలి కరెంట్ షాక్‌‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని గోదావరిఖనిలోని గవర్నమెంట్‌‌ జనరల్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు.

ప్రహరీ కూల్చేశారని బల్దియా ముందు నిరసన

మెట్ పల్లి, వెలుగు : ఇంటి నిర్మాణం కోసం డబ్బు తీసుకుని మోసం చేశాడని బల్దియా ఉద్యోగికి పూలదండ వేసి, ఆఫీస్ ముందు నిరసన తెలిపిన ఘటన మంగళవారం మెట్ పల్లిలో జరిగింది. వివరాలు.. తన ఇంటి నిర్మాణంలో సెట్ బ్యాక్ లేకుండా ప్రహరీ నిర్మించుకోవడం కోసం మెట్​పల్లికి చెందిన షేక్ అమీరొద్దిన్ స్థానిక బల్దియా టౌన్ ప్లానింగ్ విభాగంలో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సుమన్ కు కొంత డబ్బు ముట్టజెప్పాడు. బల్దియా నుంచి ఏ ఇబ్బందీ రాదని చెప్పడంతో అమీరోద్దీన్​ప్రహరీ నిర్మించుకున్నాడు. మంగళవారం టాస్క్ ఫోర్స్ టీమ్ వచ్చి సెట్ బ్యాక్ తక్కువగా ఉందని చెప్పి ప్రహరీ మొత్తం కూల్చేశారు. దీంతో బాధితుడు బంధువులతో బల్దియా ఆఫీస్​వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం సుమన్​పై చర్యలు తీసుకోవాలని  కమిషనర్ సమ్మయ్యకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇవ్వడంతో బాధితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

హుజూరాబాద్ వెలుగు: పట్టణ శివారులోని పరకాల క్రాస్ రోడ్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు  మృతి చెందినట్లు హుజురాబాద్ ఎస్సై ఎండీ ఆసిఫ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్య పల్లికి చెందిన తోట మొగిలి(54 ) సోమవారం తన కూతురు ఊరైన సీతంపేటకు టీవీఎస్ పై తులసి కోటతో బయలుదేరాడు. ఈక్రమంలో పరకాల క్రాస్ రోడ్ వద్ద  మూలమలుపుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపాడు.

పెంచిన పన్నులు తగ్గించండి

బీజేపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

కొత్తపల్లి, వెలుగు: స్థానిక మున్సిపాలిటీలో పెంచిన ఇంటి పన్నులను తగ్గించాలని బీజేపీ కొత్తపల్లి పట్టణ శాఖ అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటికి తిరిగి సంతకాలుసేకరించారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో ఇంటి పన్నులు పదింతలకుపైగా పెంచడం బాధాకరమన్నారు. సొంత ఇల్లు ఉన్నవారు మున్సిపాలిటీకి అద్దె చెల్లించి నివాసం ఉండే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు ప్రదీప్, హరీశ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.    

మంత్రికి విన్నవించాం..

పెరిగిన పన్నులు తగ్గించాలని మంత్రి కేటీఆర్​కు విన్నవించినట్లు మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అధికారులు పట్టణంలోని పలు సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.

బంగారు తెలంగాణలో గల్లీకో బెల్ట్ షాపు

జగిత్యాల, వెలుగు: సీఎం కేసీఆర్ పాలనలోని బంగారు తెలంగాణలో గల్లీకో బెల్ట్ షాపు ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాలలోని ఇందిరా భవన్ లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు పల్లెల్లోని ప్రతి గల్లీలో 24 గంటలు మద్యం అందుబాటులో ఉంచుతున్నారన్నారు. ప్రభుత్వమే అనధికారికంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తుండడంతో గౌడన్నల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు టైంలో రూ.8 వేల కోట్లు ఉన్న ఎక్సైజ్ ఆదాయం ఇప్పుడు రూ.26 వేల కోట్లకు పెరిగిందన్నారు. సమావేశంలో పీసీసీ సభ్యులు నాగ భూషణం, నందయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

హార్ట్ ఎటాక్ తో విద్యార్థి మృతి 

బోయినిపల్లి, వెలుగు: మండలంలోని వెంకట్రావుపల్లి ప్రైమరీ స్కూల్లో థర్డ్ క్లాస్ స్టూడెంట్​హార్ట్ ఎటాక్ తో మంగళవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన బుర్ర కౌశిక్ గౌడ్(9) స్కూల్ లో మధ్యాహ్న భోజనానికి తోటి విద్యార్థులతోపాటు లైన్ లో నిల్చున్నాడు. ఈక్రమంలో ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయాడు. టీచర్లు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కరీంనగర్ హాస్పిటల్​కు తరలిస్తుండగా మార్యమధ్యలో కౌశిక్​మృతి చెందినట్లు తెలిపారు. హార్ట్ ఎటాక్ తో కౌశిక్​ మృతి చెందాడని డాక్టర్లు చెప్పారు.