20 ఏళ్ల తర్వాత సాగు మొదలు పెడుతున్న కశ్మీర్ రైతులు

20 ఏళ్ల తర్వాత సాగు మొదలు పెడుతున్న కశ్మీర్ రైతులు

కథువా: జమ్మూ కశ్మీర్ లో రైతులు సాగు పనులను స్పీడప్ చేశారు. పాకిస్థాన్ తో ఉన్న సరిహద్దు వెంబడి పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కథువా జిల్లాలో సరిహద్దు గ్రామాల ప్రజలు దాదాపు 20 ఏళ్ల తర్వాత బార్డర్, జీరో లైన్ వెంబడి సాగు చేసేందుకు రెడీ అవుతున్నారు. భారత్, పాక్ బార్డర్ లో ఫెన్సింగ్ పక్కనే ఉన్న భూములను అన్నదాతలు ట్రాక్టర్లతో దున్నుతున్నారు. బీఎస్ఎఫ్ అధికారుల భద్రత మధ్య సాగు పనులు మొదలుపెట్టారు.

గతంలో ఉగ్రవాదులు, పాక్ ఆర్మీ కాల్పుల భయంతో సాగు చేయలేకపోయామని.. కానీ, ఇప్పుడు బీఎస్ఎఫ్ సెక్యూరిటీతో సాగు పనులను ప్రారంభించామని రైతులు చెప్పారు. సరిహద్దు గ్రామాల భద్రత తమ బాధ్యతని బీఎస్ఎఫ్ అధికారులు అన్నారు. వ్యవసాయ శాఖ సహకారంతో రైతులకు సెక్యూరిటీ కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం: 

నవ్వినా, మందు తాగినా కఠిన చర్యలు!

భారత్కు కావాల్సింది విప్లవం కాదు.. పరిణామం

ఆస్పత్రిలో దారుణం..మహిళలకు వేసిన కుట్లు విడిపోయాయి