రోడ్డు బాగాలేక పిల్లనిస్తలేరు

రోడ్డు బాగాలేక పిల్లనిస్తలేరు
  • మండల సభలో సర్పంచ్ ఆవేదన

మెదక్/శివ్వంపేట, వెలుగు: రోడ్డు బాగాలేక తమ గ్రామంలో యువకులకు పిల్లను ఇచ్చేందుకు వెనుకాడుతున్నారని నవాపేట సర్పంచ్ అశోక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. మెదక్​జిల్లా శివ్వంపేట ఎంపీపీ ఆఫీసులో బుధవారం మండల జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి వెళ్లే రోడ్డు మొత్తం దెబ్బతిని వెహికల్స్​వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. ఐదేళ్ల నుంచి  చెబుతున్నా రోడ్డు వేయడం లేదన్నారు. తమ గ్రామంలో అన్ని సౌకర్యాలు ఉన్నా, రోడ్డు దుస్థితి చూసి గ్రామ యువకులకు పిల్లను ఇవ్వడం లేదన్నారు. దయచేసి ఊరికి రోడ్డు వేయించండి అంటూ ఆఫీసర్లు, మండల ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై  పంచాయతీరాజ్ ఏఈ భాస్కర్ స్పందిస్తూ రోడ్డుకు ప్రపోజల్ పంపించామని,  శాంక్షన్ కాగానే వేస్తామని అన్నారు. ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ మూడు నెలల్లో రోడ్డు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.