
రోటర్‌డామ్: ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్‌లో ఇండియా విమెన్స్ హాకీ టీమ్ సంచలన విజయం ఖాతాలో వేసుకుంది. ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ అర్జెంటీనాకు షాకిచ్చి ఔరా అనిపించింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా షూటౌట్‌లో 2–1తో అర్జెంటీనాపై గెలిచింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లూ 3–3తో సమంగా నిలిచాయి. లాల్‌రెమ్‌సియామి మూడో నిమిషంలోనే తొలి గోల్ అందించగా.. గుర్జీత్ కౌర్ (37, 50వ ని.) డబుల్ గోల్స్ చేసింది. అర్జెంటీనా ప్లేయర్ అగస్టినా (21, 36, 44వ ని) హ్యాట్రిక్ గోల్స్ కొట్టింది. షూటౌట్‌లో సోనికా, నేహా గోల్స్ సాధించగా.. అర్జెంటీనా ఒకే గోల్ కొట్టడంతో ఇండియాను విజయం వరించింది. కాగా, నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్‌లో ఇండియా మెన్స్ టీమ్ షూటౌట్‌లో 1–4 తేడాతో ఓడింది. దాంతో, ప్రొ లీగ్ టైటిల్ రేసు నుంచి దాదాపు నిష్ర్కమించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లూ చెరో రెండు గోల్స్ చేశాయి. ఇండియా తరఫున దిల్‌ప్రీత్ సింగ్ (21వ ని.), హర్మన్‌ప్రీత్ సింగ్ (60వ ని.) గోల్స్ కొట్టారు. అయితే, షూటౌట్‌లో ఇండియా నుంచి ఐదు ప్రయత్నాల్లో వివేక్ సాగర్ ప్రసాద్ ఒక్కడే గోల్ చేశాడు.