పాకిస్తాన్ విమానం లాంటి బెలూన్.. జమ్మూలో ప్రత్యక్షం..

పాకిస్తాన్ విమానం లాంటి బెలూన్.. జమ్మూలో ప్రత్యక్షం..

జమ్మూ కశ్మీర్​లోని కథువా జిల్లా లో పాకిస్థాన్ విమానం సింబల్ కలిగి ఉన్న ఓ బెలూన్​ కనిపించడం కలకలం సృష్టించింది. దానిపై పీఐఏ(పాకిస్థాన్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​) అని రాసి ఉంది. భద్రతా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కథువా జిల్లా హీరానగర్​శివారులో కనిపించిన ఈ బెలూన్​ నలుపు, తెలుపు రంగుల్లో ఉంది. అప్రమత్తమైన భద్రతా బలగాలు బెలూన్​ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కునే పనిలో ఉన్నారు. 

గత అనుభవాలు.. నివురుగప్పిన నిప్పులా పరిస్థితులు

ఇటీవల జమ్మూలో ని రాజౌరీ ప్రాంతంలో భద్రతా బలగాల చేతిలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఇదే ఏడాది ఫిబ్రవరిలో సిమ్లాలోని ఓ యాపిల్​ తోటలో గ్రీన్​, వైట్​ కలర్​కలిగిన బెలూన్ విమానం కనిపించింది. దానిపై కూడా పాక్​ ఎయిర్ పోర్ట్​ సింబర్​ ఉంది. మే 20 న అమృత్​సర్​లోని దాయాది దేశానికి చెందిన ఓ డ్రోన్​ని కూల్చివేశారు. అప్పడు మత్తు పదార్థాలు ఉన్న బ్యాగ్​ను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతాదళ సిబ్బంది చెప్పారు. అంతకుముందు నాలుగు పాకిస్థాన్​ డ్రోన్లను బీఎస్ఎఫ్​ అడ్డుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే భారత్​ పాక్ సరిహద్దులో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉందంటున్నారు విశ్లేషకులు.