సింగపూర్: నైపుణ్య ఉద్యోగుల కోసం సింగపూర్ సర్కారు స్పెషల్ వర్క్వీసాను ప్రవేశపెట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యంగల ఉద్యోగులను తీసుకొని తమ దేశాన్ని మరింత కాంపిటీటివ్‌గా తీర్చిదిద్దవచ్చని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. నెలకు కనీసం రూ.17 లక్షలు సంపాదించే ఎక్స్పాట్రియేట్లను తమ దేశానికి తీసుకొచ్చేందుకు 2 వారాల క్రితం ప్రభుత్వం కొత్త రూల్స్‌ను ప్రకటించింది. ఈ నియమాల ప్రకారం వారికి ఐదేండ్ల వీసాను ఇవ్వడంతో పాటు వారి జీవిత భాగస్వాములకూ సింగపూర్‌లో పనిచేసేందుకు అనుమతిస్తారు. సింగపూర్ మానవ వనరుల మంత్రి టాన్ సీ లెంగ్ ఈ వీసా వివరాలను సోమవారం పార్లమెంటులో వెల్లడించారు.
