పోకో ఫోన్లు మాకు రావడం లేదు: ఓఆర్‌‌‌‌ఏ

పోకో ఫోన్లు మాకు రావడం లేదు: ఓఆర్‌‌‌‌ఏ

న్యూఢిల్లీ : షావోమి సబ్‌‌ బ్రాండ్ పోకో అనుసరిస్తున్న వ్యాపార విధానాలపై  సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్‌‌ రిటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్‌‌‌‌ఏ) గుర్రుగా ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతోంది. పోకో తమకు ఫోన్ల సప్లయ్‌‌ను  ఆపేసిందని  పేర్కొంది. 

ఆన్‌‌లైన్ ఛానల్స్ ద్వారా ఫోన్లను అమ్మి, తన ఖర్చును తగ్గించుకోవాలని  చూస్తోందని ఓఆర్‌‌‌‌ఏ పేర్కొంది.  ఫిజికల్ స్టోర్లకు ఫోన్ల సప్లయ్‌‌ను ఆపేసిందని ఆరోపించింది. ఉద్యోగాలను క్రియేట్ చేయడంలో పోకో పాలుపంచుకోవడం లేదని,  ఈ కంపెనీ కేవలం మూడు డిస్ట్రిబ్యూటర్లతోనే నడుస్తోందని తెలిపింది.