
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. GHMC ఎన్నికల్లో గెలుపొందిన 150 మంది పేర్లతో గెజిట్ విడుదల చేసింది. జనవరి 16వ తేదితో గెజిట్ విడుదల చేసింది. గెజిట్ విడుదల చేసిన నెల రోజుల్లోగా కొత్త పాలకమండలి కొలువు దీరనుంది. గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం తర్వాత మేయర్,డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. జీహెచ్‌ఎంసీలో పార్టీల వారీగా మొత్తం 150 డివిజన్లకు గాను టీఆర్‌ఎస్-56, బీజేపీ-48, మజ్లిస్-44, కాంగ్రెస్-2 స్థానాలను కైవసం చేసుకున్నాయి.