యువత పోరాట ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

యువత పోరాట ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

 యువత పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నూతనంగా ఉద్యోగ నియామక పత్రాలు పొందపోతున్న వారికి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజా ప్రభుత్వం నడుపుతున్నామని భట్టి విక్రమార్క అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత సాక్షిగా నియామక పత్రాలు అందిస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ యువత కోసం రాష్ట్రంలో ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

 భవిష్యత్ లో రాష్ట్ర అభివృద్ధి కోసం సహజ వనరులు అందించడంలో సింగరేణి ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని భట్టి అన్నారు. తెలంగాణకు తలమానికంగా సింగరేణి ఉందని చెప్పారు. గత ప్రభుత్వం స్వార్ధ రాజకీయాల కోసం సింగరేణిని వాడుకుందని విమర్శించారు. బీఆర్ఎస్ అలాగే కొనసాగుంటే, సింగరేణి నిర్వీర్యం అయ్యేదని అన్నారు. సింగరేణి కార్మికులు గత 10 ఏళ్లుగా స్వేచ్ఛను కోల్పోయారని భట్టి అన్నారు. ఈ ప్రభుత్వం సంపూర్ణ స్వేచ్ఛ కల్పిస్తుందని ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వమే నేరుగా మీ దగ్గరికి వచ్చి పరిష్కరిస్తుందని చెప్పారు.

 గత ప్రభుత్వం వైఫల్యం కారణంగానే కేంద్ర ప్రభుత్వం సింగరేణి స్థలాలను వేలం వేసేందుకు ప్రయత్నించిందని అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం మనవతాదృక్పధంతో పరిష్కరిస్తుందని చెప్పారు. ఫుడల్ వ్యవస్థను రాష్ట్రంలో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రతి ఒక్క ఉద్యోగి పని చేయాలని సూచించారు.