ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

సార్లు లేరు.. పాఠాలు చెప్పలే.. పరిక్షలు ఎట్ల రాయాలి? అని దిలావర్​పూర్​ మండలం న్యూలోలం గ్రామ అప్పర్​ ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్​ ప్రశ్నించారు. శుక్రవారం 80 మంది విద్యార్థులు బడికి తాళం వేసి గ్రౌండ్​లో కూర్చున్నారు. ఏడు తరగతులకు మగ్గురు టీచర్ల ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎంసీ చైర్మన్ భూమయ్య విద్యార్థుల నిరసనకు మద్దతు పలికారు. ఎంఈవో కస్తూరి శంకర్, హెచ్ఎం లక్ష్మణ్ స్పందించి ఇంకో టీచర్​ నియమిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 
- నర్సాపూర్(జి),వెలుగు

లోకల్​ వాళ్లకే పోడు పట్టాలు ఇయ్యాలె
లోకల్​వాళ్లకే పోడు భూముల పట్టాలు ఇవ్వాలని భీమిని మండలంలోని ఖర్జీభీంపూర్ గిరిజనులు డిమాండ్​ చేశారు. శుక్రవారం పంచాయతీ ఆఫీస్ ​ఎదుట ధర్నా నిర్వహించారు. నాన్​లోకల్ వాళ్లు చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఆఫీసర్లు, లీడర్లు వారికే వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరవీలతో అర్హులకు అన్యాయం జరుగుతుందన్నారు.  ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేయాలన్నారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.
 - బెల్లంపల్లి రూరల్, వెలుగు

బదిలీ అయినా కదులుతలేడు!

మంచిర్యాల, వెలుగు:
మంచిర్యాల ఆర్డీవో ఆఫీస్​లో పనిచేస్తున్న ఒక డిప్యూటీ తహసీల్దార్​కు నెల కిందట బదిలీ అయినప్పటికీ ఇక్కడి నుంచి కదలడం లేదు. ఆయనను 'అత్యవసరంగా' తాండూర్​ మండలానికి ట్రాన్స్​ఫర్​ చేస్తూ అక్టోబర్​ 1న కలెక్టర్​ పేరిట అడిషనల్​ కలెక్టర్​ మధుసూదన్​ నాయక్​ ఆర్డర్స్​ జారీ చేశారు. బదిలీ అయిన స్థానంలో వెంటనే జాయిన్​ కావాలని ఆదేశించారు. ఇప్పటికి నెల రోజులు గడిచినా ఆయన పాత స్థానంలోనే దర్జాగా విధులు నిర్వహిస్తున్నారు. స్టాఫ్​ కొరత సాకుతో ఉన్నతాధికారులు రిలీవ్​ చేయడం లేదని చెప్తున్నారు. అలాంటప్పుడు 'అత్యవసర ట్రాన్స్​ఫర్​'కు అర్థం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. సదరు డీటీ చాలా రోజులుగా ఆర్డీవో ఆఫీస్​లో భూసేకరణ విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన కాసిపేట మండలంలో పని చేస్తున్నప్పుడు కేకే ఓసీ భూసేకరణలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఒకే సర్వేనంబర్​పై రెండు నష్టపరిహారం చెక్కులు జారీ చేసి ఏకంగా అప్పటి కలెక్టర్​ ఆర్​వీ.కర్ణన్​నే తప్పుదారి పట్టించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయన చేసిన తప్పునకు కలెక్టర్​ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. దీనిపై ఎంక్వయిరీ జరిపించిన కర్ణన్​ ఆయనకు మెమో జారీ చేసి ఆ తర్వాత మరో మండలానికి ట్రాన్స్​ఫర్​ చేశారు. ఇలా గతంలో పలు ఆరోపణలు వచ్చినప్పటికీ మళ్లీ ఆయనకే ఆర్డీవో ఆఫీస్​లో భూసేకరణ విభాగంలో కీలక బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఇందారం, శ్రీరాంపూర్​ ఓపెన్​ కాస్ట్​ ప్రాజెక్టుల భూసేకరణ జరుగుతున్న నేపథ్యంలో ఆ విభాగంలో విధులు నిర్వహించేందుకు పలువురు పోటీపడ్డారు. గతంలో ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు కంప్లైంట్స్​ చేసుకుని వారి దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒకరిని కలెక్టరేట్​కు, మరొకరిని నస్పూర్​కు డిప్యూటేషన్​పై పంపారు. ప్రస్తుతం తాండూర్​కు బదిలీ అయిన అధికారిని రిలీవ్​ చేయకుండా ఉన్నతాధికారులు ఎందుకంత ప్రేమ చూపుతున్నారు? 'అత్యవసరంగా' బదిలీ చేసినప్పుడు ఆయన స్థానంలో మరొకరిని ఎందుకు నియమించడం లేదు? అన్న చర్చ జరుగుతోంది. తాండూర్​ మండలంలో డీటీ లేకపోవడంతో అక్కడి అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైన పనులకు పక్క మండలాల డీటీలపై ఆధారపడుతున్నారు


సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ 

మంచిర్యాల, వెలుగు: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం మంచిర్యాల మున్సిపాలిటీ 24 వార్డులో రూ.4.25 లక్షలతో ఏర్పాటు చేసిన 34  కెమెరాలను పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్​లో డీసీపీ అఖిల్ మహాజన్​తో కలిసి ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో వార్డులో అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు పరిష్కారం, నేరస్తులను గుర్తించడం  సులభమవుతుందన్నారు. దాతల సాయంతో 24వ వార్డులోని రెడ్డికాలనీ, సెవెన్ హెల్స్ స్కూల్ ఏరియా, హనుమాన్ నగర్​లో కెమెరాలను ఏర్పాటు చేశామని కౌన్సిలర్​ వేములపల్లి సంజీవ్​ తెలిపారు. ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ నారాయణ, కాలనీవాసులు దాసరి రాజేశం,  గుండా సుధాకర్, సిరాజ్​ ఉర్ రెహ్మాన్, బొమ్మ సత్తిరెడ్డి, కొత్త సురేందర్ పాల్గొన్నారు. 

ఆధార్​ అప్​డేట్​ చేసుకోవాలి....   
ఆధార్ కార్డును అప్​డేట్ చేయడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. డీఎఫ్​వో శివ్​ ఆశిష్​సింగ్​తో కలిసి కలెక్టరేట్​లో ఆధార్​ అప్​డేట్​ పోస్టర్లను శుక్రవారం రిలీజ్​ చేశారు. 10 సంవత్సరాల కిందట పొందిన ఆధార్ కార్డు అప్​డేట్ చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు, దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్, బ్యాంకు ఖాతా, మొబైల్ సిమ్ కార్డు, స్కాలర్​షిప్​లు పొందడం సులభమవుతుందని అన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ ను సులభంగా ఈ-–వెరిఫై చేసుకోవచ్చని అన్నారు.

సరస్వతీ పుత్రికకు లక్ష్మీ కటాక్షం కరువు 

చెన్నూర్​, వెలుగు: కోటపల్లి మండలం అన్నారం గ్రామానికి చెందిన కోట రవీనా తన ప్రతిభతో ఎంబీబీఎస్​లో సీటు సాధించినా ఫీజులు కట్టలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అడ్మిషన్లకు ఈ నెల 8 చివరి తేదీ కావడంతో ఈలోగా దాతలు స్పందించి ఆదుకోవాలని వేడుకుంటోంది. రవీనాది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కోట శంకరమ్మ, కిష్టయ్య ఇద్దరు వికలాంగులు. వారికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు సంతానం. తల్లిదండ్రుకు వచ్చే పింఛన్​తోనే ఇల్లు గడుస్తోంది. రవీనా గౌలిగూడలోని తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ కాలేజీలో ఇంటర్​ చదివింది. నీట్​లో ప్రతిభ కనపర్చి మహబూబ్​నగర్​లోని గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీలో సీటు సాధించింది. కానీ యూనివర్సిటీ, కాలేజీ, హాస్టల్​ ఫీజులు ఏడాదికి రూ.లక్షకు పైగా ఖర్చవుతాయి. తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో తన ఎంబీబీఎస్​ చదువు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దాతలు స్పందించి ఆర్థికసాయం అందిస్తే ఎంబీబీఎస్​ పూర్తి చేసి పేదలకు సేవలందిస్తానని తెలిపింది. దాతలు కోట రవీనా, అకౌంట్​ నంబర్​ 41298832206, ఎస్​బీఐ చెన్నూర్​ బ్రాంచి, ఐఎఫ్​ఎస్​సీ – ఎస్​బీఐఎన్​0018873 లో డబ్బులు జమచేయాలని వేడుకుంది.

షిర్డీకి బస్సు ప్రారంభం
ఆసిఫాబాద్,వెలుగు: ఆసిఫాబాద్ టు షిర్డీకి ఆర్టీసీ బస్సు ప్రారంభమైంది. శుక్రవారం ఆర్​టీవో గంధం లక్ష్మి బస్సు సర్వీను ప్రారంభించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిపో మేనేజర్ శ్రీధర్ మాట్లాడుతూ బస్సు ప్రతిరోజూ మధ్యాహ్నం 12:45 గంటలకు ఆసిఫాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు షిర్టీ చేరుకుంటుందన్నారు. తిరిగి అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు షిర్డీ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:05 గంటలకు ఆసిఫాబాద్​ చేరుకుంటుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ విశ్వనాథ్, ఎంఎఫ్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలి

కాగజ్ నగర్, వెలుగు: విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని టీచర్స్​ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ రెడ్డి సూచించారు. సిర్పూర్ నియోజకవర్గంలోని  అయిదు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కోనేరు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం గొప్ప విషయమన్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ కాలేజీల్లో పేద స్టూడెంట్స్ కి భోజన సౌకర్యం ఎంతో మేలు చేస్తోందన్నారు. ఎంవీ ఫౌండేషన్ ప్రతినిధి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కోనప్ప చేస్తున్న సేవ మంచిదన్నారు. చదువులో ముందుంటే వెనకబాటు లేనట్టేనన్నారు. ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ విద్యార్థుల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజనం ప్రారంభించినట్లు చెప్పారు. స్టూడెంట్స్​ప్రయోజకులు కావాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్​చాహత్ బాజ్​పేయ్, డీఈవో అశోక్, డీఐఈవో శ్రీధర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

భైంసా/ముథోల్,వెలుగు: బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టీఆర్ఎస్ సర్కార్​ను ఇంటికి పంపాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు పటేల్ కోరారు. శుక్రవారం ముథోల్ మండలం తరోడా గ్రామంలోని ఫార్మ్ హౌస్ లో కుంటాల మండల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం చాలా వెనునుబడ్డదని, గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఎనిమిదేళ్లలో ఏ ఒక్క పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. కేంద్రంలో మోడీ సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. 

త్వరలో బండి సంజయ్ పాదయాత్ర...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర త్వరలో ముథోల్ నియోజకవర్గంలో ప్రారంభమవుతుందని మోహన్ రావు పటేల్ తెలిపారు. భైంసా నుంచి నిర్మల్ మీదుగా యాత్ర సాగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుభాష్ జాదవ్, కల్లూరు సర్పంచ్ లక్ష్మణ్ పటేల్,  లీడర్లు కట్ట రవి, తాటి శివ, తాడేవార్ సాయినాథ్, గాలి రవి, దిలీప్  పాల్గొన్నారు.

విద్యుత్ సవరణ బిల్లును అడ్డుకోవాలి

నిర్మల్,వెలుగు: పుదిచ్చేరి విద్యుత్​ కార్మికుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యుత్​సవరణ బిల్లును అడ్డుకోవాలని1104 సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేమునూరి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ లో జరిగిన డివిజన్ స్థాయి విద్యుత్ ఉద్యోగుల సంఘ సమావేశానికి ఆయన హాజరయ్యారు. సెంట్రల్​గవర్నమెంట్​తీసుకొచ్చిన బిల్లు అమలైతే విద్యుత్​ కార్మికులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోందన్నారు. రైతులు, బడుగు బలహీన వర్గాలకు అందుతున్న సబ్సిడీ కూడా రద్దు అవుతుందన్నారు. కేంద్ర విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా ఈనెలలో ఢిల్లీలో జరపతల పెట్టిన మహా ధర్నాకు ఉద్యోగులు పెద్దసంఖ్యలో తరలిరావాలన్నారు. సమావేశంలో యూనియన్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరాజు, కార్యదర్శి అక్కల పోచయ్య, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ జె.రాజేశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కుమారస్వామి, డివిజన్ అధ్యక్షుడు కొడాలి వెంకటరమణ, కార్యదర్శి మనోహర్ స్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కొరిపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేశ్వరరావు, జిల్లా సలహాదారు రేగుంట రాజేశ్వర్, శ్రీరామోజీ ప్రసాద్, గంగ కిషన్, దేవారావు, రాజశేఖర్, జెన్ కో  రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ శ్రీనివాస్, విద్యాసాగర్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

శివాలయంలో ఎంపీ పూజలు
ఆసిఫాబాద్,వెలుగు: రెబ్బెన మండలం నంబాల శివాలయంలో శుక్రవారం ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపూరావు పూజలు చేశారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో సహస్ర సామూహిక వాసవీ కన్యకాపరమేశ్వరి దేవీ వ్రతకల్పం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు గుల్బం చక్రపాణి , ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్  కొలిపాక కిరణ్ కుమార్, కమిటీ సభ్యులు ఎంపీని సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ 

మంచిర్యాల, వెలుగు: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం మంచిర్యాల మున్సిపాలిటీ 24 వార్డులో రూ.4.25 లక్షలతో ఏర్పాటు చేసిన 34  కెమెరాలను పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్​లో డీసీపీ అఖిల్ మహాజన్​తో కలిసి ప్రారంభించారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో వార్డులో అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు పరిష్కారం, నేరస్తులను గుర్తించడం  సులభమవుతుందన్నారు. దాతల సాయంతో 24వ వార్డులోని రెడ్డికాలనీ, సెవెన్ హెల్స్ స్కూల్ ఏరియా, హనుమాన్ నగర్​లో కెమెరాలను ఏర్పాటు చేశామని కౌన్సిలర్​ వేములపల్లి సంజీవ్​ తెలిపారు. ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ నారాయణ, కాలనీవాసులు దాసరి రాజేశం,  గుండా సుధాకర్, సిరాజ్​ ఉర్ రెహ్మాన్, బొమ్మ సత్తిరెడ్డి, కొత్త సురేందర్ పాల్గొన్నారు. 

ఆధార్​ అప్​డేట్​ చేసుకోవాలి....   
ఆధార్ కార్డును అప్​డేట్ చేయడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. డీఎఫ్​వో శివ్​ ఆశిష్​సింగ్​తో కలిసి కలెక్టరేట్​లో ఆధార్​ అప్​డేట్​ పోస్టర్లను శుక్రవారం రిలీజ్​ చేశారు. 10 సంవత్సరాల కిందట పొందిన ఆధార్ కార్డు అప్​డేట్ చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు, దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్, బ్యాంకు ఖాతా, మొబైల్ సిమ్ కార్డు, స్కాలర్​షిప్​లు పొందడం సులభమవుతుందని అన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ ను సులభంగా ఈ-–వెరిఫై చేసుకోవచ్చని అన్నారు.