మనదేశంలో 2011 తురువాత అన్ని ప్రాంతాల జనంలోనూ లైఫ్‌స్టైల్ జబ్బులు పెరిగాయని హ్యుమన్ డేటా సేన్స్ కంపెనీ ఐక్యూవీఐఏ స్టడీ వెల్లడించింది. ఈ జబ్బుల చికిత్సల కోసం, మందుల కోసం పెట్టే ఖర్చు విపరీతంగా పెరిగిందని తెలిపింది. బరువు పెరగడం, లిక్కర్, పొగాకు వాడకం వల్ల అన్ని వయసులవాళ్లూ లైఫ్‌స్టైల్ వ్యాధుల బారినపడుతున్నారని తెలిపింది. కరోనా ట్రీట్‌మెంట్ సమయంలో స్టెరాయిడ్స్ తీసుకున్నవారికి కొత్తగా మరిన్ని రోగాలు వచ్చే అవకాశం ఉందని హెల్త్ఎక్స్పర్టులు అంటున్నారు.

న్యూఢిల్లీ: దేశమంతటా గుండె, షుగర్ జబ్బుల మందులు విపరీతంగా అమ్ముడవుతున్నాయి. టాప్–5 సెల్లింగ్ డ్రగ్స్‌లో షుగర్ మందులు కూడా చేరాయి. 2011 వరకు టాప్–5 సెల్లింగ్ డ్రగ్స్ లిస్టులో షుగర్ మెడికేషన్లు లేవు. ఆ తరువాత ఏడాది నుంచి డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏటా దాదాపు రూ. 21 వేల కోట్ల విలువైన కార్డియాక్ , రూ.16 వేల కోట్ల విలువైన షుగర్ మెడికేషన్స్, మందులు అమ్ముడవుతున్నాయి. గత 30 ఏళ్లుగా డ్రగ్స్ సేల్స్ వివరాలను పరిశీలించడం ద్వారా ఈ డేటాను తయారు చేశామని హ్యూమన్ డేటా సైన్స్ కంపెనీ ఐక్యూవీఐఏ వెల్లడించింది. ఇటీవల గుండె, షుగర్ జబ్బుల బాధితులు విపరీతంగా పెరిగారని పేర్కొంది. 1991లో యాంటీ-ఇన్ఫెక్టివ్స్, విటమిన్స్, రెస్పిరేటరీ, పెయిన్ మెడికేషన్స్ మందులు టాప్–5 సెల్లింగ్ డ్రగ్స్‌లో ఉండేవి. ఇప్పుడు టాప్–5లోకి కార్డియాక్, యాంటి-ఇన్ఫెక్టివ్స్, గ్యాస్ట్రో-ఇంటెస్టైనల్ , యాంటీ డయాబెటిక్, విటమిన్స్ మందులు వచ్చాయి. ‘‘గత పదేళ్లలో షుగర్, హైపర్‌టెన్షన్, కార్డియాక్, కిడ్నీ రోగులు పెరిగారు. పల్లెటూళ్లలో కూడా లైఫ్‌స్టైల్ వ్యాధులు పెరుగుతున్నాయి. బరువు పెరగడం కూడా సర్వసాధారణంగా మారింది. తక్కువ వయసున్న వాళ్లకూ గుండెపోటు వస్తోంది. పొగాకు, లిక్కర్ వాడకం పెరగడం ఇందుకు ముఖ్యం కారణం. చాలా మంది పడచువాళ్లూ బీపీ, డయాబెటిస్ బారినపడుతున్నారు’’ అని మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ ఎస్పీ కళాంత్రి చెప్పారు. ఇట్లాంటి జబ్బుల మందులు విపరీతంగా అమ్ముడవుతున్నాయి కాబట్టి ఫార్మా కంపెనీలు కూడా కొత్త మాలిక్యూల్స్‌తో డ్రగ్స్ తయారు చేస్తున్నాయని అనంత్ భాన్ అనే బయోకెమిస్ట్ అన్నారు. ఇందుకోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. ఇరిస్ లైఫ్‌సైన్సెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణకుమార్ మాట్లాడుతూ బీపీ, షుగర్ల గురించి జనంలో అవగాహన పెరగడంతో, ట్రీట్‌మెంట్లూ, మందుల వాడకమూ పెరిగిందని చెప్పారు. కరోనా వచ్చాక జబ్బుల గురించి ఆందోళన మరింత ఎక్కువయిందని అన్నారు. ఈ మహమ్మారి వల్ల లైఫ్‌స్టైల్ రోగుల సంఖ్య ఇంకా పెరగవచ్చని చెప్పారు. ‘‘కరోనా ట్రీట్‌మెంట్ కోసం చాలా మందికి స్టెరాయిడ్స్ ఇచ్చారు. దీనివల్ల చాలా మందికి డయాబెటిస్ ముప్పు పొంచి ఉంది. దక్షిణాసియా ప్రజలు జన్యువుల కారణంగా కార్డియో మెటబాలిక్ వ్యాధుల బారినపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’’ అని అన్నారు.