టీచర్ రాకుంటే ఈ పెన్నే పాఠం చెప్తది

టీచర్ రాకుంటే ఈ పెన్నే పాఠం చెప్తది

క్లాస్​ ఇంట్రెస్టింగ్​గా చెప్తేనే శ్రద్ధగా వింటారు స్టూడెంట్స్. అందుకని టీచర్లు కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటిదే ఈ కొత్తరకం పెన్ను​. ఈ పెన్ను స్పెషాలిటీ ఏంటంటే... ఏ టీచర్ అయినా రాకపోతే ఆ రోజుఆ టీచర్ చెప్పాల్సిన పాఠం మిస్​ అవుతామనే బెంగ ఉండదు స్టూడెంట్స్​కి​.  అదెలాగంటే... ఈ పెన్ను సాయంతో రికార్డు చేసిన పాఠాల్ని వినొచ్చు. ‘టీచింగ్​– లెర్నింగ్’ టెక్నాలజీలో భాగంగా ఈ వెరైటీ పెన్ను తయారు చేశారు  నౌరంగాబాద్ ఊళ్లోని గవర్నమెంట్ స్కూల్​ టీచర్లు.

హిమాచల్ ప్రదేశ్​లోని సిర్మౌర్​ జిల్లాలో ఉంది నౌరంగాబాద్. అక్కడి గవర్నమెంట్​ స్కూల్ హెడ్​మాస్టర్​ సైన్స్​ టీచర్​ సంజీవ్​ అత్రి. స్కూల్లో ఏరోజైనా టీచర్​ సెలవులో ఉన్నప్పుడు ఆ రోజు స్టూడెంట్స్  క్లాస్ మిస్​ అయ్యేవాళ్లు. ​ ఈ సమస్యకు పరిష్కారంగా సెన్సర్ పెన్ను తయారుచేయాలనుకున్నాడు సంజీవ్. ఇదే విషయం  టీచర్లకు చెప్తే ‘ఐడియా బాగుంద’న్నారు. మూడు నెలలు కష్టపడి 20 అడుగుల పొడవు, 43 కిలోల బరువు ఉన్న పెన్ను తయారుచేశారు. ఈ భారీ పెన్నుని ఈ మధ్యే స్కూల్​ ఎంట్రన్స్​ ముందు పెట్టారు. దీనికి ‘శక్తి’ అని పేరు పెట్టారు. ఇందులో రెండు లీటర్ల ఇంక్​ పట్టే సదుపాయం ఉంది. దీన్ని కొయ్య, ఇనుముతో తయారు చేశారు. పెన్ను తయారీకి ఖర్చయిన45 వేల రూపాయల్ని టీచర్లు తలా కొంత భరించారు. 

సౌండ్ సెన్సర్​, సీసీ కెమెరాలు

సెలవులో ఉండే టీచర్లు ముందు రోజు పాఠాల్ని రికార్డ్ చేస్తారు. లేదంటే ఫోన్​లో రికార్డు చేసి ప్రిన్సిపల్​కి పంపిస్తారు. వాటిని ఈ పెన్నులోని సౌండ్ సెన్సర్ సాయంతో పిల్లలకు వినిపిస్తారు. పాఠాలతో పాటు కథలు, పాటల్ని కూడా రికార్డు చేస్తున్నారు టీచర్లు. ఇందులోని సెన్సర్లు అన్నిరకాల కమాండ్స్​ని ఇస్తాయి.  ఈ పెన్నులో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రపంచంలోనే పొడవైన పెన్ను ఎత్తు 18 అడుగులు. దాంతో ఈ పెన్ను త్వరలోనే  ‘లిమ్కా బుక్ ఆఫ్​ వరల్డ్ రికార్డ్సు’లోకి కూడా ఎక్కనుంది.