
హైదరాబాద్, వెలుగు : నేషనల్ చైల్డ్, మినీ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్లను తెలంగాణ ఫెన్సింగ్ సంఘం మంగళవారం ప్రకటించింది. దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ క్యాంపస్ వేదికగా జరిగిన సెక్షన్ ట్రయల్స్‌లో ప్రతిభ ఆధారంగా చైల్డ్ (అండర్-10), మినీ (అండర్12) బాలబాలికల జట్లను ఎంపిక చేశారు. ఈ ట్రయల్స్‌లో ఆరేండ్ల చిన్నారి ఐదిక తన నైపుణ్యంతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
చైల్డ్ (అండర్-10) ఫాయిల్ వ్యక్తిగత విభాగంలో స్టేట్ టీమ్‌కు ఎంపికైంది. ఓవరాల్‌గా 46 మంది ఫెన్సర్లను చైల్డ్, మినీ విభాగాల్లో జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 5 నుంచి 9 వరకు మహారాష్ట్రలోని నాసిక్‌లో జరుగనున్న జాతీయ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ జరగనుంది. రాష్ట్ర జట్లకు ఎంపికైన చిన్నారి ఫెన్సర్లకు తెలంగాణ ఫెన్సింగ్ సంఘం అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి సందీప్ కుమార్ జాదవ్
అభినందనలు తెలిపారు.