
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా గాయకుడు గద్దర్ పేరిట అవార్జులను ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు రిలీజైన బెస్ట్ సినిమాలకు మాత్రమే అవార్డ్స్ ఇవ్వనున్నారు. అయితే, 2014-23 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను త్వరలో ప్రకటిస్తామన్న జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ తెలిపారు.
ఈ సందర్భంగా నేడు (మే29న) 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఇచ్చారు. తెలుగు చిత్రాలతోపాటు ఉర్దూ చిత్రాలకూ అవార్డుల్లో ప్రాధాన్యతనిచ్చారు. గద్దర్ అవార్డుల కోసం పలు కేటగిరీల కింద నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిని స్క్రీనింగ్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత.. FDCచైర్మన్ దిల్ రాజుతో జయసుధ కలిసి, అవార్డు అందుకున్న సినిమాల వివరాలు వెల్లడించారు.
మొత్తం 11 కేటగిరీల్లో పలు సినిమాలు ఎంపిక చేశారు. కాగా ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం పూర్తీ వివరాలను అనౌన్స్ చేశారు. వీటితో పాటు తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలు అందించిన ఎన్టీఆర్, పైడి జయరాజ్, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ప్రస్తుతం గద్దర్ అవార్డులను అందుకున్న సినిమాల పూర్తి జాబితా చూద్దాం.
2024 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్:
కల్కి 2898ఏడీ (ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్)
పొట్టేల్ (సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్)
లక్కీ భాస్కర్ (థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్)
టైటిల్ ఆఫ్ ది ఫిల్మ్ ( కమిటీ కుర్రోళ్ళు)
ఉత్తమ నటులు:
ఉత్తమ నటుడు అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి - నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు)
ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి: శరణ్యా ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ దర్శకుడు:
నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ సంగీత దర్శకుడు:
భీమ్స్ సిసిరోలియో (రజాకార్)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప 2)
స్పెషల్ జ్యూరీ అవార్డు:
అనన్య నాగళ్ల (పొట్టేల్)
దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2)
ఉత్తమ బాలల చిత్రం:
నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు)
ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ అవార్డు
యాట సత్యనారాయణ తెరకెక్కించిన (రజాకార్)
ఉత్తమ స్క్రీన్ ప్లే
వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ హాస్యనటులు
వెన్నెల కిషోర్, సత్య
బెస్ట్ సినిమాటోగ్రఫీ:
విశ్వనాధ్ రెడ్డి (గామి)
బెస్ట్ లిరిసిస్ట్:
చంద్రబోస్ (రాజు యాదవ్)
బెస్ట్ ఎడిటర్:
నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
ఉత్తమ కొరియోగ్రాఫర్
గణేష్ ఆచార్య (దేవర)
ఉత్తమ రచయితలు:
ఉత్తమ కథా రచయితల-శివ పాలడుగు
ఉత్తమ పుస్తకం-రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం)
List of Gaddar Film Awards 2024. @revanth_anumula @JSKapoor1234 @DilRajuProdctns pic.twitter.com/Osgndb05cR
— Jacob Ross (@JacobBhoompag) May 29, 2025
లక్కీ భాస్కర్ సినిమాకు అత్యధికంగా గద్దర్ అవార్డుల్లో సత్తా చాటింది. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా డైరెక్టర్ వెంకీ అట్లూరికి, థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్ గా లక్కీ భాస్కర్, స్పెషల్ జ్యూరీ అవార్డును హీరో దుల్కర్ సల్మాన్, బెస్ట్ ఎడిటర్ గా నవీన్ నూలి లక్కీ భాస్కర్ సినిమాకు గానూ అందుకున్నారు. ఇలా నాలుగు విభాగాల్లో లక్కీ భాస్కర్ అవార్డులు అందుకుని సత్తా చాటింది.
Best Leading Actor #alluarjun for #Pushpa2TheRule#GaddarAwards #GaddarTelanganaFilmAwards pic.twitter.com/kHcFjEeAoI
— Ramesh Pammy (@rameshpammy) May 29, 2025