ఖో ఖో లీగ్‌‌‌‌‌‌‌‌లో అదరగొట్టిన తెలుగు యోధాస్‌‌‌‌‌‌‌‌ టీమ్

ఖో ఖో లీగ్‌‌‌‌‌‌‌‌లో అదరగొట్టిన తెలుగు యోధాస్‌‌‌‌‌‌‌‌ టీమ్

ముంబై: లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్టిమేట్‌‌‌‌‌‌‌‌ ఖో ఖో లీగ్‌‌‌‌‌‌‌‌లో తెలుగు యోధాస్‌‌‌‌‌‌‌‌ జట్టు అదరగొట్టింది. అంచనాలను అందుకుంటూ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనే సూపర్‌‌‌‌‌‌‌‌ విజయాన్ని సాధించింది. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తెలుగు యోధాస్‌‌‌‌‌‌‌‌ 10 పాయింట్ల తేడాతో చెన్నై క్విక్‌‌‌‌‌‌‌‌ గన్స్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది.  తెలుగు టీమ్​ 48 పాయింట్లు చేయగా, చెన్నై 38 పాయింట్లకే పరిమితమైంది. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ నుంచే పక్కా ప్లాన్‌‌‌‌‌‌‌‌తో ఆడిన తెలుగు టీమ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 29–15తో ముందంజ వేశారు.

అయితే సెకండ్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో చెన్నై వరుస పాయింట్లతో ఆధిక్యంలోకి వచ్చింది. తెలుగు ప్లేయర్లను కట్టడి  చేస్తూ 23–19 లీడ్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న తెలుగు టీమ్‌‌‌‌‌‌‌‌ 10 పాయింట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గుజరాత్‌‌‌‌‌‌‌‌ జెయింట్స్‌‌‌‌‌‌‌‌ 25 పాయింట్ల తేడాతో ముంబై ఖిలాడీస్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. గుజరాత్‌‌‌‌‌‌‌‌ 69 పాయింట్లు సాధించగా, ముంబై 44 పాయింట్లే చేసింది. అంతకుముందు ఫ్రాంచైజీ ఆధారిత ఈ లీగ్‌‌‌‌‌‌‌‌ను సీఈవో, కమిషనర్‌‌‌‌‌‌‌‌ టెన్జింగ్‌‌‌‌‌‌‌‌ నియోగి, ఇండియా ఖో ఖో ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ సుధాన్షు మిట్టల్‌‌‌‌‌‌‌‌  ప్రారంభించారు.