
అహ్మదాబాద్ : దశాబ్ద కాలంగా కబడ్డీ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లోకి అడుగు పెడుతోంది. శనివారం ఇక్కడి ఈకేఏ ఏరీనాలో తెలుగు టైటాన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో మెగా లీగ్ పదో ఎడిషన్‌కు తెరలేవనుంది. లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడైన పవన్ సెహ్రావత్ కెప్టెన్‌గా టైటాన్స్‌ను నడిపించబోతున్నాడు. లీగ్‌లో అత్యంత ఖరీదైన డిఫెండర్‌గా నిలిచిన ఫజెల్ అత్రాచలి గుజరాత్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు.
తొలి మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. మరోవైపు ఈ లీగ్‌ను తిరిగి కారవాన్ మోడల్‌కు తీసుకెళ్తున్నట్టు లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తెలిపారు. లీగ్ బరిలో నిలిచిన 12 జట్లకు చెందిన 12 నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తామన్నారు.