
మంచు మోహన్ బాబు కుటుంబం నుంచి ముచ్చటగా మూడో తరం కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా సింగర్స్‌గా పరిచయం అవుతున్నారు. విష్ణు హీరోగా నటిస్తున్న ‘జిన్నా’ చిత్రంలో ‘ఇదే స్నేహం’ అంటూ ఫ్రెండ్ షిప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పాటను ఈ ట్విన్ సిస్టర్స్ పాడారు. అనూప్ రూబెన్స్ ట్యూన్ చేసిన సాంగ్‌కు భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ రాశారు. మ్యూజిక్ డైరెక్టర్స్ కీరవాణి, కోటి, దేవిశ్రీ ప్రసాద్, తమన్, అచ్చు రాజామణి, సింగర్స్ మనో, గీతా మాధురి తదితరులు మంచు సిస్టర్స్‌కి ఆల్ ద బెస్ట్ చెబుతూ మ్యూజిక్ వరల్డ్‌లోకి వెల్‌కమ్ చెప్పారు.