ఆరు నుంచి ఎనిమిది వారాల్లో థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌ రావొచ్చు

ఆరు నుంచి ఎనిమిది వారాల్లో థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌ రావొచ్చు
  • ఎప్పటిలానే జనం మళ్లీ గుమికూడుతున్నరు: గులేరియా

న్యూఢిల్లీ: కరోనా రూల్స్‌‌‌‌ పాటించ కపోతే, ఎక్కడపడితే అక్కడ జనం గుమికూడితే దేశంలో మరో 6 నుంచి 8 వారాల్లో కరోనా థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌ రావొచ్చని న్యూఢిల్లీ ఎయిమ్స్‌‌‌‌ చీఫ్‌‌‌‌ రణ్‌‌‌‌దీప్‌‌‌‌ గులేరియా శనివారం చెప్పారు. ఫస్ట్‌‌‌‌, సెకండ్‌‌‌‌ వేవ్‌‌‌‌ల నుంచి ప్రజలెవరూ ఏం నేర్చుకోలేద నిపిస్తోందని అన్నారు. ‘మళ్లీ జనం గుమికూడుతున్నారు. ఫిజికల్‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌ పాటించట్లేదు’ అని చెప్పా రు. అవసరమైనంత మందికి టీకా వేసే వరకు మాస్క్‌‌‌‌, ఫిజికల్‌‌‌‌ డిస్టెన్స్‌‌‌‌ పాటించాలని.. పాజిటివిటీ 5% కన్నా  ఎక్కువ ఎక్కడ పెరిగినా  ఆంక్షలు పెట్టాలని చెప్పారు. థర్డ్‌‌‌‌ వేవ్‌‌‌‌లో పిల్లలు ఎక్కువగా వ్యాధి బారిన పడతారనడానికి ఎలాంటి ఆధారాల్లేవన్నారు.