
రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. మాస్ థండర్ అంటూ టీజర్‌తోనే సినిమా ఎలా ఉండబోతోందో చూపించారు దర్శకుడు బోయపాటి శ్రీను. రామ్ ఎనర్జీకి తగ్గట్టుగా తన తన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఆయన దీన్ని తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తునారు. షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈనెల 3న ఉదయం 11.25 నిమిషాలకు మూవీ టైటిల్‌ను రివీల్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఈ చిత్రానికి ‘స్కంద’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే టైటిల్‌ను ఫైనల్ చేస్తారా.. మరో టైటిల్ ఫిక్స్ చేస్తారా అనే ఆసక్తి నెలకొంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరాకు విడుదల కావాల్సిన ఈ చిత్రం నెలరోజుల ముందుగానే ప్రేక్షకుల ముందుకొస్తోంది. సెప్టెంబర్ 15న రిలీజ్ అని ఇటీవల ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకే రోజున విడుదల కానుంది.