మొబైల్స్​ ద్వారా తెగ కొనేస్తున్నరు

మొబైల్స్​ ద్వారా తెగ కొనేస్తున్నరు

పేపాల్ ఎంకామర్స్ రిపోర్టు వెల్లడి
యాప్స్ ద్వారా పేమెంట్లు పెరిగాయ్
సోషల్ కామర్స్‌‌లో యూత్ ముందు

ముంబై : మొబైల్ ఫోన్ల ద్వారా కొనుగోళ్లు, ఆన్‌‌లైన్ పేమెంట్లు బాగా పెరిగిపోతున్నాయి. 88 శాతం ఇండియన్ కన్జూమర్లు మొబైల్ ఫోన్లు వాడే కొనుగోళ్లు చేపడుతున్నారని, ఆన్‌‌లైన్‌‌లో చెల్లింపులు చేస్తున్నారని పేపాల్, ఐపీఎస్‌‌ఓఎస్‌‌ ఎంకామర్స్ రిపోర్ట్‌‌ వెల్లడించింది. ఎంకామర్స్ పేరుతో పేపాల్ ఈ రిపోర్ట్‌‌ను విడుదల చేసింది. ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా మొబైల్ కామర్స్(ఎంకామర్స్) ఎలా ఉందనే విషయంపై పేపాల్ ఏర్పాటు చేసిన ఐపీఎస్‌‌ఓఎస్ ఈ అధ్యయనం నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో సుమారు 22 వేల మంది కన్జూమర్లు, 4 వేల మంది బిజినెస్‌‌ రెస్పాండెంట్లపై ఈ సర్వే చేపట్టారు. దీనిలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. ఇండియా ఎంకామర్స్‌‌ను అందిపుచ్చుకోవడంలో ముందంజలో ఉందని పేర్కొంది.

డిమాండ్‌‌ను అందుకోవడానికి 81 శాతం మర్చంట్లు మొబైల్ పేమెంట్లను యాక్సప్ట్‌‌ చేస్తున్నారని పేపాల్ రిపోర్టు చెప్పింది. గ్లోబల్‌‌గా మాత్రం సగటున 63 శాతం మంది మర్చంట్లు మాత్రమే మొబైల్ పేమెంట్లను యాక్సప్ట్ చేస్తున్నారని పేర్కొంది. ఎంకామర్స్‌‌లో యాప్స్‌‌ చాలా పాపులర్ సాధించాయని, 98 శాతం మంది ఇండియన్ మొబైల్ షాపర్లు యాప్స్ ద్వారానే పేమెంట్లు చేస్తున్నారని చెప్పింది. గ్లోబల్‌‌గా ఈ పర్సంటేజ్ 90 శాతంగా ఉందని పేపాల్ వివరించింది. యాప్‌‌ లలో బిల్లు పేమెంట్లు, ఫ్యాషన్ కీలక రంగాలుగా ఉన్నట్టు  పేర్కొంది. సమయం ఆదా, తేలిక లావాదేవీలు, మొబైల్ కామర్స్‌‌కు కీలకంగా ఉంటున్నాయని తెలిపింది.

సోషల్ కామర్స్ తర్వాతి గేమ్ ఛేంజర్…

ఇండియాలో సోషల్ కామర్స్ అడాప్షన్ కూడా పెరుగుతోందని రిపోర్టు తెలిపింది. గత ఆరు నెలల్లో 57 శాతం కొనుగోళ్లు సోషల్ కామర్స్ ద్వారా జరిగాయని పేర్కొంది. సోషల్ కామర్స్ కొనుగోళ్లలో యంగర్ జనరేషన్ ముందంజలో ఉంది. 54 శాతం జనరేషన్ జెడ్, 61 శాతం మిలీనియల్స్ సోషల్ కామర్స్ కొనుగోళ్లు చేపడుతున్నారు.

మరిన్ని వార్తల కోసం