వరల్డ్​ హ్యాపీనెస్ రిపోర్టు -2023

వరల్డ్​ హ్యాపీనెస్ రిపోర్టు -2023

ఐక్యరాజ్య సమితి గ్లోబల్​ సర్వే డేటా ఆధారంగా 2023 ఏడాదికిగాను వరల్డ్​ హ్యాపీనెస్​ రిపోర్టును విడుదల చేసింది. మొత్తం 150 దేశాల్లోని డేటాను పరిగణనలోకి తీసుకుని నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్​ 126వ స్థానంలో నిలిచింది. గత ఏడాది (2022) 136వ స్థానంలో ఉన్న భారత్​ ఈ ఏడాది ఏకంగా 11 స్థానాలు మెరుగుపరుచుకుంది. పొరుగు దేశాలైన చైనా (64), నేపాల్​ (78), శ్రీలంక (112), బంగ్లాదేశ్​ (118) భారత్​ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. 

ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్​ వరుసగా ఆరోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో డెన్మార్క్,​ ఐస్​లాండ్​, ఇజ్రాయెల్​, నెదర్లాండ్​ నిలిచాయి. అమెరికా 15వ స్థానంలో నిలిచింది. –

ఈ జాబితాలో సియెర్రా లియోన్​ (135), లెబనాన్​ (136), ఆప్ఘనిస్తాన్​ (137)వ ర్యాంకులతో అట్టడుగున ఉన్నాయి. రష్యా యుద్ధంతో సతమతమవుతున్న ఉక్రెయిన్​ సంతోషకరమైన దేశాల జాబితాలో 92వ స్థానంలో ఉంది. రష్యా 70వ స్థానం దక్కించుకుంది. 

2012 నుంచి ఐరాసకు చెందిన సస్టెయినబుల్​ డెవలప్​మెంట్​ సొల్యూషన్స్​ నెట్​వర్క్​ ఏటా ప్రపంచ ఆనంద నివేదికను విడుదల చేస్తోంది. గత మూడేళ్ల వ్యవధిలో ఆయా దేశాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు, ఆరోగ్యం, కుటుంబ జీవనం, మానసిక ఆరోగ్యం, జీడీపీ, సామాజిక మద్దతు, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతి స్థాయి వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు.