
లెజెండ్ బిహైండ్ ద లీడర్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోంది. జయలలిత లైఫ్ లో ఎంతో ఇంపార్టెం ట్ వ్యక్తి అయిన ఎంజీఆర్ పాత్రని అరవింద్ స్వామి పోషిస్తున్నాడు. నిన్న ఎంజీఆర్ 104వ జయంతి సందర్భంగా ‘తలైవి’ టీమ్ ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది. యాభయ్యేళ్లకి పైగా తమిళనాట హీరోగా, పొలిటీషియన్‌గా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు ఎంజీఆర్. ‘తలైవి’ వెనకున్న లెజెండ్ కూడా ఎంజీఆరే అంటూ ఆయన్ని గుర్తు చేసుకున్నారు. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కరుణానిధిగా ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. పూర్ణ, భాగ్యశ్రీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. శైలేష్ ఆర్ సింగ్, విష్ణు ఇందూరి, బృందాప్రసాద్ నిర్మి స్తున్నారు. రీసెంట్‌గా షూటింగ్ కంప్లీటయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అతి త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.