ఒకటి కాదు రెండు మాస్క్ లు తప్పనిసరి

V6 Velugu Posted on Apr 14, 2021

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నయ్​. అయినా రోడ్లన్నీ హడావిడిగానే కనిపిస్తున్నయ్​. మార్కెట్స్​, షాపింగ్​ మాల్స్,  థియేటర్స్​​ ఇలా ఎక్కడ చూసినా జనాలు కుప్పలు తెప్పలుగా ఉంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో  కరోనా నుంచి తప్పించుకోవడం తేలికేనా?  మనం పెట్టుకునే మాస్క్​ కరోనా వ్యాప్తిని అడ్డుకోగలదా? అంటే లేదనే చెప్తోంది. యూఎస్​ సెంటర్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​( సిడిసి) స్టడీ.  కరోనా కాలంలో  బతికి బట్టకట్టాలంటే రెండు మాస్క్​లు  తప్పనిసరి అంటోంది ఈ స్టడీ . సర్జికల్​ మాస్క్​పైన క్లాత్​ మాస్క్​  లేదా రెండు క్లాత్​ మాస్క్​లు పెట్టుకుంటే కరోనా వైరస్​  అంటుకోదని అంటున్నారు. ఒకవేళ ఎన్​ 95 లేదా కెఎన్​95 మాస్క్​లు పెట్టుకుంటుంటే డబుల్​ మాస్క్​లు అవసరం లేదంటున్నారు  డాక్టర్​ రోమెల్​ టిక్కో.  అయితే రెండు డిస్పోజబుల్​ సర్జికల్ మాస్క్​లు మాత్రం పెట్టుకోవద్దు అంటున్నారు. ఎందుకంటే సర్జికల్​ మాస్క్​లు వైరస్​ పార్టికల్స్​ని కట్టడి చేసినప్పటికీ ముఖానికి సరిగా ఫిట్​ అవ్వవు.  మాస్క్​ పెట్టుకున్నప్పటికీ సైడ్స్​లో చాలా గ్యాప్​ ఉంటుంది. దానివల్ల వైరస్​​ తేలిగ్గా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే సర్జికల్​ మాస్క్​పైన క్లాత్​ మాస్క్​ పెట్టుకోవాలి అంటున్నారు ఎక్స్​పర్ట్స్.  ఒకవేళ  సర్జికల్​ మాస్క్​లనే ఎంచుకుంటే ఇయర్​ లూప్స్​ని ముడివేసి మాస్క్​లని ముఖానికి సరిగ్గా ఫిట్​ చేయమని చెప్తున్నారు.  
 

Tagged mandatory

Latest Videos

Subscribe Now

More News