టీకా పడితేనే చెట్టాపట్టాల్​

టీకా పడితేనే చెట్టాపట్టాల్​

ఆన్​లైన్​లో అయినా డైరెక్ట్​గా అయినా సరిజోడుని వెతుక్కోవాలంటే చాలా విషయాలు ఆలోచిస్తారు. జాబ్​, ప్రొఫైల్​, హ్యాబిట్స్​... ఇలా అన్నీ నచ్చితేనే ఓకే  చెబుతారు. ఈ మధ్య లవ్​ కార్నర్​లోకి వ్యాక్సిన్​ కూడా చేరిపోయింది. చాలామంది  అమ్మాయిలు వ్యాక్సిన్​ వేసుకోని వాళ్ల ప్రొఫైల్​ కనీసం చూడను కూడా చూడట్లేదట. లవ్​లైఫ్​లకరోనా తెచ్చిన ఈ ట్రెండ్ గురించి డేటింగ్​ యాప్స్​ అనాలసిస్​ ఇలా ఉంది..ఒక వ్యక్తి పర్సనాలిటీని అంచనా వేసేందుకు వ్యాక్సినేషన్​ కొలమానంగా పనికొస్తుందట. ప్రొఫైల్​ ఎంత బాగున్నా కూడా వ్యాక్సిన్​ వేసుకోకుంటే మ్యాచింగ్​ సెట్​ కావడం లేదట. దాదాపు 41 శాతం మంది అమ్మాయిలు తమకు బాగా నచ్చిన వ్యక్తి వ్యాక్సిన్​ వేసుకోకున్నా, వ్యాక్సినేట్​ అయ్యేందుకు ఆసక్తి చూపించకున్నా మొహమాట పడకుండా ‘నో’ చెప్పేస్తున్నారట. 
‘ఐ యామ్​ వ్యాక్సినేటెడ్​’ బ్యాడ్జ్​
ఇప్పుడు చాలా డేటింగ్ యాప్స్​ వ్యక్తిగత ప్రొఫైల్​లో ‘ఐ యామ్​ వ్యాక్సినేటెడ్​’ బ్యాడ్జ్​ని తీసుకొచ్చాయి.  దాంతో, వ్యాక్సిన్​ వేసుకున్న వాళ్ల ప్రొఫైల్స్​ మాత్రమే చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు యూజర్లు. ‘‘డేటింగ్​ యాప్స్​లో వ్యాక్సినేషన్​పై చర్చించడం76% పెరిగింది. గత జూన్​ వరకు యూజర్లలో 69% మంది మగవాళ్లు, 71% ఆడవాళ్లు ‘మేము కరోనా వ్యాక్సిన్​ వేసుకుంటాం’ అని చెప్పారు. ‘ఐ యామ్​ వ్యాక్సినేటెడ్’ బ్యాడ్జ్​ పెట్టాక, మ్యాచింగ్స్​ 35 % పెరిగాయి. మిగతా యూజర్లు  త్వరలోనే వ్యాక్సిన్ వేసుకోబోతున్నారు” అంటున్నాడు ‘ఓకే క్యుపిడ్​ ఇండియా’ డైరెక్టర్​ అనుకూల్​ కుమార్​.
ఫస్ట్​ డోస్​ తీసుకున్నా ‘ఓకే’
“మా యూజర్లలో 80 శాతం మంది వ్యాక్సిన్​ వేసుకోని వాళ్లతో బయటకి వెళ్లడానికి ఇష్టపడట్లేదు. దాదాపు 30 శాతం మందికి పైగా కొత్త యూజర్లు తమ ప్రొఫైల్​లో ‘ఐ యామ్​ వ్యాక్సినేటెడ్​’ బ్యాడ్జిని యాడ్​ చేసుకున్నారు” అని చెబుతున్నాడు ‘క్వాక్​క్వాక్​’ డేటింగ్ యాప్​ సీఈవో రవి మిట్టల్​. కనీసం ఫస్ట్​ డోస్​  తీసుకున్న వాళ్లతో  డేట్​కి వెళ్లేందుకు 60% మంది యూజర్లు ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారని ‘వూ’ డేటింగ్​ యాప్​  అనాలసిస్​ చెబుతోంది