‘ది కాశ్మీర్ ఫైల్స్’ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి నుంచి వస్తున్న చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. అనుపమ్ ఖేర్, సప్తమి గౌడ, పరితోష్ శాండ్, స్నేహ మిలాండ్, దివ్య సేథ్ నటిస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ డ్రిల్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పల్లవి జోషి నిర్మిస్తూ, కీలక పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 28న సినిమాను విడుదల చేయబోతున్నట్టు మంగళవారం ప్రకటించారు.
ఇందులో నానా పటేకర్ కూడా నటిస్తున్నట్టు తాజాగా విడుదల చేసిన వీడియో గ్లింప్స్‌లో చూపించారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ నిర్మించిన అభిషేక్ అగర్వాల్.. ఇందులోనూ అసోసియేట్ అయ్యారు. పదికి పైగా భాషల్లో సినిమా విడుదల కానుంది.