వీడియో 10 సెకన్లు మాత్రమే ఉంది.. కావాలనే రికార్డ్ చేశారు : ప్రతిమారాజ్

వీడియో 10 సెకన్లు మాత్రమే ఉంది.. కావాలనే రికార్డ్ చేశారు : ప్రతిమారాజ్

నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో రోగిని కాళ్లు పట్టుకుని లాక్కెళ్లిన ఘటనపై ఆస్పత్పి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ స్పందించారు. అసలేమైందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసిన ఆమె.. గత నెల 31 న పేషేంట్ ఆసుపత్రికి వచ్చారని, ఆ సమయంలో పేషేంట్ మద్యం మత్తులో ఉన్నాడని చెప్పారు. తాము వెంటనే స్పందించి వైద్యం కోసం రెఫర్ చేశామన్నారు. క్యాజువాలిటీ నుంచి లిఫ్ట్ వరకు ఆసుపత్రి సిబ్బంది వీల్ చైర్ లో తీసుకెళ్లారన్న సూపసూపరింటెండెంట్.. వైరల్ అయిన వీడియోలో ఆసుపత్రి  సిబ్బంది లేరని చెప్పారు. పేషేంట్ ను లాక్కెళ్లిన వీడియో 10 సెకన్లు మాత్రమే ఉందని, అది కూడా కావాలనే రికార్డ్ చేశారని ఆరోపించారు. అసుపత్రిలో కావాలసినన్ని వీల్ ఛైర్స్, స్ట్రెచ్చర్స్ ఉన్నాయని  ప్రతిమారాజ్ చెప్పారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ వీడియోను కావాలనే తీశారని, అతన్ని పట్టుకునేందుకు తమ సిబ్బంది ప్రయత్నించినా, అతను దొరకలేదని చెప్పారు. కావాలనే 15 రోజుల తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆరోపించారు. 

సిబ్బంది మనోభావాలను దెబ్బతీయాలని ఇలా చేశారని ప్రతిమారాజ్ చెప్పారు. రాష్ట్రంలో అత్యధిక సక్సెస్ రేట్ తో వైద్యం చేస్తున్న ఆసుపత్రి ఇది అని, మెరుగైన వైద్యం ఇస్తోన్న నిజామాబాద్ ఆసుపత్రిపై దుష్ప్రచారం చేయటం కరెక్ట్ కాదని ప్రతిమారాజ్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేయిస్తామన్న ఆమె.. నిందితులపై చర్యలకు పిర్యాధు చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషేంట్ ను ఆసుపత్రి సిబ్బంది జాగ్రత్తగా వీల్ చైర్ లో తీసుకెళ్లాక.. ఈ వీడియో షూట్ చేశారని చెప్పారు. మీడియా మిత్రులు సహనం పాటించాలని, నిజాలను మాత్రమే ప్రసారం చేయాలని ఈ సందర్భంగా సూపరింటెండెంట్ విజ్ఞప్తి చేశారు. హన్మండ్లు.. అనే పేషేంట్ గా ప్రాథమికంగా గుర్తించామన్న ఆమె.. ఈ వార్తను ఖండిస్తున్నామని, ఈ ఘటనపై, ఈ వీడియో షూట్ చేసిన వ్యక్తిపై పోలీసులకు పిర్యాధు చేశామని స్పష్టం చేశారు.